US Flight Delays:


అమెరికాలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ కంప్యూటర్‌లో సాంకేతిక లోపాల కారణంగా పలు చోట్ల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అమెరికాకు వచ్చే, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే దాదాపు 1200కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు FAA ప్రకటన కూడా చేసింది. 


"ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫైనల్ వ్యాలిడేషన్ చెక్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎయిర్‌ స్పేస్ సిస్టమ్‌పై ప్రభావం పడింది" 


-ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 


నోటీస్‌ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) సిస్టమ్‌ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే అన్ని విమానాల పైలట్‌లను అప్రమత్తం చేశారు.