UIDAI launches Aadhaar app for Android and iOS:  యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త 'ఆధార్ యాప్'ను   విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ,  iOS డివైస్‌లకు అందుబాటులో ఉన్న ఈ యాప్, ఫేస్ స్కాన్ ఆధారిత సెక్యూరిటీ, మల్టీ-ప్రొఫైల్ మేనేజ్‌మెంట్, QR కోడ్ షేరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఉంది.  ఇప్పటికే ఉన్న mAadhaar యాప్‌తో పాటు పనిచేస్తూ, ఆధార్ కార్డును డిజిటల్ వాలెట్‌గా మార్చి, ఫిజికల్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. UIDAI అధికారికంగా ప్రకటించినట్లు, ఈ యాప్ యూజర్ ప్రైవసీని మరింత బలోపేతం చేస్తూ, ఫ్యామిలీ మెంబర్ల ఆధార్ డేటాను సురక్షితంగా మేనేజ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్,  యాపిల్ యాప్ స్టోర్‌లలో ఇప్పటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Continues below advertisement

ఈ యాప్ విడుదలను UIDAI సీఈ ప్రకటించారు. "ఆధార్‌ను మరింత సులభం, సురక్షితంగా ఉపయోగించుకోవడానికి ఈ యాప్ ఒక మైలురాయి. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా, ప్రజలకు డోర్‌స్టెప్ సర్వీసెస్ అందించడానికి ఇది కీలకం" అని ప్రకటించారు. ఈ యాప్‌తో ఆధార్ కార్డు డౌన్‌లోడ్, వెరిఫికేషన్, అప్‌డేట్‌లు వంటి సేవలు ఇంకా సులభమవుతాయి. ఈ యాప్ mAadhaar యాప్‌తో పోల్చితే మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంది. mAadhaar ప్రధానంగా వెరిఫికేషన్, డౌన్‌లోడ్‌లకు ఉపయోగపడితే, కొత్త యాప్ డిజిటల్ ID వాలెట్‌గా పనిచేస్తుంది.

ముఖ్య ఫీచర్లు  

Continues below advertisement

ఫేస్ స్కాన్ సెక్యూరిటీ : యాప్‌లోకి యాక్సెస్ చేసుకోవడానికి  ఫేస్ స్కాన్ ఆధారిత బయోమెట్రిక్ లాక్. ఇది ఫింగర్‌ప్రింట్, OTPలతో పాటు మరింత సురక్షితం.  మల్టీ-ప్రొఫైల్ మేనేజ్‌మెంట్ : ఒకే యాప్‌లో ఫ్యామిలీ మెంబర్లు పిల్లలు, భాగస్వామి ఆధార్ ప్రొఫైల్స్‌ను మేనేజ్ చేయవచ్చు. ప్రతి ప్రొఫైల్‌కు స్వతంత్ర పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ ఉంటుంది.

QR కోడ్ షేరింగ్ : ఆధార్ కార్డును QR కోడ్ రూపంలో జనరేట్ చేసి, సురక్షితంగా షేర్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్, KYC వెరిఫికేషన్‌లకు ఉపయోగపడుతుంది.

డిజిటల్ ID వాలెట్ : ఆధార్ కార్డును మొబైల్‌లో సేఫ్‌గా స్టోర్ చేసి, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. ఫిజికల్ కార్డ్ మరచిపోయినా సమస్య ఉండదు.

అప్‌డేట్ & వెరిఫికేషన్ సేవలు : ఆధార్ డేటా అప్‌డేట్ (ఫోటో, అడ్రస్), e-KYC, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివి ఒకే యాప్‌లో.

ప్రైవసీ ప్రొటెక్షన్ : డేటా షేరింగ్‌లో యూజర్ కన్సెంట్ తప్పనిసరి. షేర్ చేసిన డేటా ట్రాకింగ్ ఫీచర్ ఉంది.  

కొత్త ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా సులభం.  గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత   12-అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఫేస్ స్కాన్  స్కాన్ లేదా బయోమెట్రిక్ సెటప్ చేసి, ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్ల ప్రొఫైల్స్ యాడ్ చేయవచ్చు. యాప్ ఓపెన్ చేసి, QR కోడ్ జనరేట్ చేసి షేర్ చేయండి. అప్‌డేట్‌లకు 'Update Aadhaar' సెక్షన్ వాడండి.

ఈ యాప్‌తో ప్రజలు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్, పాన్ కార్డ్ లింక్, డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ వంటి పనులు ఇంటి నుంచే చేయవచ్చు. మోదీ ప్రభుత్వం 'డిజిటల్ ఇండియా' లక్ష్యంలో భాగంగా ఈ యాప్‌ను విడుదల చేసింది. యూజర్ల సందేహాలకు UIDAI హెల్ప్‌లైన్ 1947కు కాల్ చేయవచ్చు లేదా uidai.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు.