Cheetah Cubs Death:
మొత్తం ఆరు చీతాలు మృతి..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవలే ఓ చిరుత పిల్ల చనిపోయింది. ఇప్పుడు మరో రెండు చీతాలూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీన జ్వాలా చీతా నాలుగు చిరుతలకు జన్మనిచ్చింది. వీటిలో మూడు చనిపోయాయి. నాలుగో చీతాను ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ చీతా ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు. మొదటి చీతా...వీక్‌నెస్ కారణంగా చనిపోయిందని వివరించారు. ఇప్పటి వరకూ కునో నేషనల్ పార్క్‌లో ఆరు చీతాలు ప్రాణాలొదిలాయి. ఇవన్నీ ఆఫ్రికా నుంచి వచ్చినవే. ఈ ఏడాది మార్చి 27వ తేదీన నమీబియా నుంచి వచ్చిన చీతా సాశా కన్నుమూసింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ తరవాత ఏప్రిల్ 13వ తేదీన ఉదయ్ చీతా చనిపోయింది. మే 9వ తేదీన దక్ష అనే మరో చీతా అనారోగ్యంతో ప్రాణాలొదిలింది. దీనిపై ఆఫ్రికన్ చీతా మెటా పాప్యులేషన్ ఎక్స్‌పర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైల్డ్ చీతాల్లో పిల్లలు చనిపోవడం మామూలే అని వివరించారు.
"మరో చీతా చనిపోవడం చాలా బాధాకరం. చీతాలు ఇలా చనిపోవడం అసహజం ఏమీ కాదు. వైల్ట్ చీతాల్లో మరణాల రేటు అధికంగానే ఉంటుంది. మిగతా చీతాలతో పోల్చుకుంటే...వీటికి ఎక్కువ సంఖ్యలో సంతానం కలుగుతుంది. ఎండాకాలం కావడం వల్ల డీహైడ్రేషన్ కారణంగా చీతాలు చనిపోతుంటాయి. పుట్టుకతోనే వీక్‌గా ఉన్న పిల్లలు త్వరగా ప్రాణాలు కోల్పోతాయి"
- నిపుణులు
దక్షిణాఫ్రికాలోని వాటర్‌బర్గ్ బయోస్పియర్ నుంచి దక్ష, నిర్వా, వాయు, అగ్ని, గామిని, తేజస్, వీర, సూరజ్, ధీర, ప్రభాస్, పావక్ అనే 11 చిరుతలతో పాటు ఉదయ్ అని మగ చిరుతను భారత్ కు తీసుకొచ్చారు. దేశంలో ఎప్పుడో అంతరించిన చిరుతలను మళ్లీ సంరక్షించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన 12 చిరుతలలో 7 మగ చిరుతలు ఉన్నాయి. అందులో మగ చిరుత ఉదయ్ కూడా ఉంది. అయితే వాటర్ బర్గ్ బయో స్పియర్ నుంచి తీసుకొచ్చిన చిరుతలలో చనిపోయిన రెండో చిరుత ఉదయ్. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో మార్చి 23న షాషా అనే ఆడ చనిపోవడం తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్ సమస్యల కారణంగా ఆడ చిరుత షాషా మృతి చెందింది.
Also Read: Tipu Sultan Sword Auction: రూ.140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం, లండన్‌లో వేలంపాట