కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలందరికీ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేసేసింది. అలాగే ఆ పార్టీకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దాదాపుగా ఐదు వేల మంది ట్విట్టర్ అకౌంట్లను కూడా నిలిపివేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ దళిత బాలిక అత్యాచారం, హత్య కేసు ఘటనలో బాధితురాలి ఐడెంటీటీని ట్విట్టర్‌లో బయట పెట్టారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ట్విట్టర్ రాహుల్ గాంధీ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు సోషల్ మీడియాలో చురుకుగా పోస్టులు పెట్టే కీలక నేతలతో పాటు దాదాపుగాఐదు వేలమంది అకౌంట్లను బ్లాక్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ గత రాత్రి నుంచి ఎలాంటి పోస్టులను ట్విట్టర్‌లో చేయలేకపోతోంది. [insta]
[/insta]
తమను ట్విట్టర్ బ్లాక్ చేసిందని ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో కాంగ్రెస్ పార్టీ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ బెదిరింపులకు ట్విట్టర్ లొంగిపోయిందని... ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తోందని మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అంటే.. ఎందుకు అంత భయమని మోడీని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయడంపై ట్విట్టర్ స్పందించలేదు. బ్లాక్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ డైరక్ట్‌గా ఎలాంటిపోస్టులు చేయలేదు కానీ.. తన ఫోలయర్స్‌కు మాత్రం నేరుగా సందేశాలు పంపే అవకాశం ఉంటుంది. కొంత కాలంగా ట్విట్టర్‌గా భారత ప్రభుత్వానికి మధ్య వివాదాలు రేగుతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ప్రకారం కొంత మంది ఆఫీసర్లను నియమించడానికి ట్విట్టర్ అంగీకరించ లేదు. దీంతో సోషల్ మీడియా సైట్లకు ప్రభుత్వం కల్పించిన మధ్యవర్తి హోదాను ట్విట్టర్‌కు తొలగించింది.
దీంతో ట్విట్టర్‌లో ఎవరు అభ్యంతరకర ట్వీట్లు చేసినా ఆ సంస్థనే బాధ్యుల్ని చేయడం ప్రారంభించారు. రెండు, మూడు సార్లు కేసులుపెట్టి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ .. కేంద్ర చట్టాన్ని అమలు చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినట్లుగా ట్విట్టర్... రాహుల్ గాంధీ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఇప్పుడు ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేదు కానీ.. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఐదు వేల మంది కార్యకర్తల అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. మళ్లీ ఎప్పుడు అకౌంట్లను పునరుద్ధరిస్తారో ట్విట్టర్ చెప్పలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం... భావవ్యక్తీకరణ స్వేచ్చపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని దానికి ట్విట్టర్‌తో వ్యవహరిస్తున్న విధానమే కారణమని ఆరోపిస్తోంది.