Tamil Nadu Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్‌కు రాజకీయం మార్చాలనుకుంటున్న టీవీకే చీఫ్ - అన్నాడీఎంకే రేసులో లేదని తేల్చేశారా?
Tamilnadu Politics: తమిళనాడులో స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా రాజకీయం మార్చాలనుకుంటున్నారు టీవీకే చీఫ్. అన్నాడీఎంకేను లెక్కలో లేదని ఆయన వేలూరు సభలో ప్రకటించారు.

TVK chief Vijay Politics:తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. వేలూరులో ప్రచార సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని, టీవీకే క్లీన్ స్వీప్ చేస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా పోటీ కేవలం తమ పార్టీకి, అధికార డీఎంకేకు మధ్యే ఉంటుందని ప్రకటించడం ద్వారా, అన్నాడీఎంకే ఉనికిని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. క్షేత్రస్థాయిలో డీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు సంకేతాలు పంపడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
తమిళనాడు అంటే విజయ్.. విజయ్ అంటేనే తమిళనాడు అంటూ గతాన్ని గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. డీఎంకే పాలనపై విజయ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది స్టాండప్ కామెడీ ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన ప్రభుత్వం సూపర్ స్టార్ మోడల్ అని చెప్పుకుంటున్నారని, కానీ అది నిజానికి సూపర్ స్టాండప్ కమెడియన్ మోడల్ అని ఎద్దేవా చేశారు. స్టాలిన్ ప్రకటిస్తున్న పథకాలు, చేస్తున్న వాగ్దానాలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా కేవలం తన పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడానికేనని, అవి స్టాలిన్ ఆపరేటింగ్ ప్రొసీజర్' లా మారిపోయాయని విమర్శించారు.
"வண்டி பின்னாடி வராதீங்க.. கெஞ்சி கேட்டுக்கிறேன்" | Vijay Request | Vellore TVK Meetinghttps://t.co/wupaoCz9iu | #vijay #vellore #tvk #tvkvijay #tamilnews #abpnadu pic.twitter.com/inVdwaIHwt
— ABP Nadu (@abpnadu) February 23, 2026
గత ఏడాది కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ శత్రువులు ఎవరూ లేరని చెప్పే స్టాలిన్, మరి ఆ ఘటనకు తనను ఎందుకు బాధ్యుడిని చేశారని నిలదీశారు. ప్రభుత్వం కావాలనే తక్కువ స్థలం ఉన్న ప్రాంతాల్లో సభలకు అనుమతి ఇచ్చి, భద్రతా వైఫల్యాలకు కారణమైందని ఆరోపించారు. 2026 ఎన్నికలు దుష్ట శక్తి, స్వచ్ఛమైన శక్తి మధ్య జరిగే పోరాటమని ఆయన అభివర్ణించారు.
Vijay Kutty Story | "சின்னப் பையன் ENTRY ஸ்டைலா, கெத்தா, தில்லா..” விஜய் KUTTY STORY | TVK | Vijay Vellore speech https://t.co/wupaoCzH82 | #vijay #vijaykuttystory #mkstalin #tvk #dmk #tvkvijay #tamilnews #abpnadu pic.twitter.com/5olpxZdXp6
— ABP Nadu (@abpnadu) February 23, 2026
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది తనతోనే సాధ్యమని విజయ్ బలంగా నమ్ముతున్నారు. స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు ప్రతిపక్ష కూటమి రేసులో లేదని చెప్పడం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలను 'విజయ్ వర్సెస్ స్టాలిన్' మధ్య జరిగే పోరుగా అభివర్ణిస్తున్నారు. అన్నాడీఎంకే పట్టు కోల్పోయిన స్థానాల్లో టీవీకే తన బలాన్ని పెంచుకుంటే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



















