Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Telugu Top News Today | మే 28న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE

Background
కాలం మారుతుంది. తరాలు మారుతాయి. కానీ కొన్ని పేర్లు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారుగా వెండితెరపై దేవుడుగా కొలిచే నందమూరి తారక రామారావు 103 జయంతి వేడుకల తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఆరాధ్య దైవానికి నివాళి అర్పిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఆయన ఆశయాల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తన తాతాగారికి జూనియర్ ఎన్టీఆర్, సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి నివాళి అర్పించారు. సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి కాసేపు మౌనం పాటించారు. వారితోపాటు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకి తరలి వచ్చారు. ఆప్రాంతమంతా జోహార్ ఎన్టీఆర్,జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. " కృష్టి ఉంటే మనుషులు రుషులవుతారు... మహా పురుషులవుతారు అనే మాటు నిలువెత్తు నిదర్శనం అన్నారు.
1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన రామారావు, కేవలం నటుడిగానే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కారణజన్ముడు అని చంద్రాబాబు అన్నారు. రాజకీయాల్లో ఆయన తెచ్చిన మార్పులు, సామాజిక సంస్కరణలు నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ గురించి చిరంజీవి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రను ఎన్టీఆర్ లేకుండా ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీర్ కేవలం సినిమా కోసమే జన్మించిన మహానుభావుడని చిరంజీవి స్మరించుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ సినీ అవార్డుల వేడుకలో తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం తన జీవితంలో అత్యంత ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. తరాలు మారినా ఎన్టీఆర్ ప్రభావం తెలుగు జాతిపై చెరిగిపోదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కూడా తన తండ్రికి నివాళి అర్పించారు నేటి తరానికి ఎన్టీఆర్ అంటే అదే గౌరవం అభిమానం ఉండటానికి ఆయన నిబద్ధతే కారణమని ఆమె పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు దిక్సూచిగా మారాయని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
Hyderabad Latest Crime News: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో తీర్పు వాయిదా!
Hyderabad Latest Crime News: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రెండో సారి పోలీసులు కోరారు. మరోవైపు తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పిటిషన్ వేశారు. రెండింటిపై విచారణ చేపట్టిన కోర్టు వాదనలు పూర్తిగా విన్నది. అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ న కస్టడీ, బెయిల్ పిటిషన్లు పై నిర్ణయం వెల్లడించునున్నట్టు నాంపల్లి కోర్టు తెలిపింది. ఇప్పటికే నిందితులను ఐదు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు.
Karnataka New CM: సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Karnataka New CM: కర్ణాటక సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించారు. అధిష్టానం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మంత్రిమండలి రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు





















