అన్వేషించండి

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు

Top Stories Today | జూన్6న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల వార్తల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.

హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ధనికులు చెరువులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే 'హైడ్రా'ను ఏర్పాటు చేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హిట్లర్‌కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది దీనికి పేరు పెట్టానని, ఇందులో 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పుడు ఆక్రమణలకు ఎవరూ సాహసించలేరని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు దేశంలోనే అత్యుత్తమమైన 'ఈగిల్ ఫోర్స్'ను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.

బెంగళూరులో నిర్వహించిన ఒక సదస్సులో "గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ" అనే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్ అవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిని కేవలం పన్నులు వసూలు చేసే ప్రాంతంగానే చూస్తోందని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి అత్యున్నత పదవులన్నీ ఉత్తరాది నేతలకే కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. "మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ.. రెండో శ్రేణి పౌరులుగా బతకాలనుకోవడం లేదు" అంటూ దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని వినిపించారు.

అలాగే గుజరాత్ మోడల్‌పై మండిపడుతూ, అక్కడ బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. తన పోటీ భారతీయ రాష్ట్రాలతో కాదని.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతోనేనని స్పష్టం చేశారు. తెలంగాణను 'చైనా + 1' ప్రత్యామ్నాయంగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో చైనాను రీప్లేస్ చేయడమే తన నినాదమని సీఎం ప్రకటించారు.

పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జన్వాడలోని 'కోడి చెరువు' స్థలాన్ని ఆక్రమించి పవన్ ఫామ్‌హౌస్ నిర్మించారని, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం అది చెరువు శిఖం భూమి అని తేలిందని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ.. కబ్జా అని రుజువైతే ప్రభుత్వానికి ఇస్తానన్న మాట ప్రకారం ఆ భూమిని వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎలాంటి చెరువు స్థలాన్ని ఆక్రమించలేదని, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Shreyas Iyer is Team India's T20 captain: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 

Shreyas Iyer is Team India's T20 captain: ఐపీఎల్‌లో సత్తాచాటుకున్న చాలా మంది క్రికెటర్లకు జాతీయ జట్టులో ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ఎప్పుడ జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌ను టీ 20 కెప్టెన్‌గా చేశారు. చిచ్చర పిడుగు సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించారు. 

శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ(VC), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

Image

ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సింఘ్ సూర్యవంశీ, హర్షి సూర్యవంశీ.

Image

ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ (విసి), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Image

Vijayawada to Singapore Flight: గన్నవరం రన్‌వేపై నిలిచిపోయిన విమానం!

Vijayawada to Singapore Flight: విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం రన్‌వేపై అకస్మాత్తగా నిలిచిపోయింది. 9.40 గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎమ్మెల్యే యార్లగడ్డ సహా 133 మంది ప్రయాణికులు ఉన్నారు. 

CJP Protest: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన, అభిజీత్ దీప్కే హాజరు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ 

CJP Protest:కాక్రోచ్‌ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతోంది. నిరసనకారులు, "మేము విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్నాం, ఆయన జీతం మా పన్నుల నుంచే వస్తుంది! బొద్దింకలు వచ్చాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతారు!" అని నినాదాలు చేసారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టింది సీజేపీ. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలో పాల్గొన్నారు.  

CJP Protest: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే ! 

CJP Protest: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి విచ్చేశారు. వచ్చిన అనంతరం ఆయన జంతర్‌మంతర్ వద్దకు బయల్దేరారు. అలా బయల్దేరే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు," అని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. 

Cockroach Janta Party Protest LIVE: ఢిల్లీలో దిగిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

Cockroach Janta Party Protest LIVE: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఆయనను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకునే అవకాశం లేదని, తన గమ్యస్థానానికి వెళ్లేందుకు అనుమతిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Cockroach Janta Party Protest LIVE: సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన  

"అత్యంత దారుణమైన పరిస్థితికి సిద్ధంగా ఉండటమంటే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్టు అయ్యే అవకాశానికి కూడా సిద్ధంగా ఉండటమే. ఒకవేళ అలా జరిగితే, మనం నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉండాలి," అని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.

Cockroach Janta Party Protest LIVE: భారత రాజకీయాల్లో ఇది ఒక చారిత్రాత్మక దినం : సీజేపీ ప్రతినిధి 

డిజిటల్ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, "అవును, అభిజీత్ దీపక్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన దీని గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇది భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము."

"అభిజిత్ దీపక్ త్వరలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తాము, అక్కడ ఆయన నిరసన కోసం ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి కోరతారు. అనుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత, మేము జంతర్ మంతర్ వద్ద కూర్చుని నిరసన తెలుపుతాము," అని ఆయన అన్నారు.

చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా- పది లక్షల సరకు పది నిమిషాల్లో ఖాళీ!

Chittoor Crime News: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా పడింది. సుమారు పది లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. మొత్తం సరకు క్షణాల్లోనే మాయం చేశారు. చిత్తూరు నుంచి కార్వేటి నగరం మండలానికి మద్యం తీసుకెళ్తున్న వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. 

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, సినీ నటుడు రవితేజ కుమారుడు, హీరో మహాధన్ కుమార్తె మోక్షద, వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. గత సంవత్సరం నవంబర్ లో శ్రీవారిని దర్శించి, తన కొడుకు గురించి ప్రార్థించానని, శ్రీవారు ఆశీస్సులు లభించాయని, విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ ఆలయం వెలుపల మీడియా కు వివరించారు. తాను నటించిన మారెమ్మ చిత్రం వచ్చేనెల విడుదల కానుందని, ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదించాలని హీరో మహాధన్ తెలిపారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget