Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Top Stories Today | జూన్ 4న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల వార్తల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి,
Ameerpet Fire Accident: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Ameerpet Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కేఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
Viral News: గంజాయి డోర్ డెలవరి- ర్యాపిడో రైడర్ అప్రమత్తతో పట్టుకున్న పోలీసులు
Viral News: హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గంజాయిని ర్యాపిడోలో బుక్ చేసి పార్సిల్ పంపించాడో పెడ్లర్. మే 31న మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా పార్సిల్ బుక్ చేశారు. బిహార్ చెందిన రుపేష్ కుమార్ తీరుపై ర్యాపిడో డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పార్సిల్ పరిశీలించగా గంజాయిగా తేలింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సమాచారం ఇచ్చినందుకు ర్యాపిడో డ్రైవర్ ఆదర్శన్ ను డీసీపీ కోటిరెడ్డి సన్మానించారు.

KTR visits Balka Suman in Chanchalguda Jail: బాల్క సుమన్‌ను చంచల్‌గూడ జైలులో పరామర్శించిన కేటీఆర్
KTR visits Balka Suman in Chanchalguda Jail: ములాకత్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను కేటీఆర్ పరామర్శించారు. ఈ పరామర్శలో ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి ఉన్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలిపిన కేటీఆర్.
BRS Leader Balka Suman: బాల్క సుమన్ కేసు బంజారాహిల్స్ పీఎస్‌కి బదిలీ
BRS Leader Balka Suman: బీఆర్‌ఎస్ లీడర్ బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్య లపై సింగరేణి భవన్ జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎఫ్ఎఆర్ నమోదు అయ్యింది. గత నెల 26న నాంపల్లి స్టేషన్ లో నమోదైన కేసును బంజారాహిల్స్ కు బదిలీ చేశారు. గత నెల 30న ఇదే కేసులో సుమన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన నాంపల్లి పోలీసులు, దర్యాప్తు బంజారాహిల్స్ స్టేషన్ నుంచే ప్రారంభం కానుండగా కేసు బదిలీ అయ్యింది. బాల్క సుమన్‌ను మూడు రోజుల కస్టడీ కోరుతూ నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయునున్నారు.
Madhuyashki Goud Wife Latest News: కోలుకుంటున్న మధుయాష్కీ గౌడ్ భార్య
Madhuyashki Goud Wife Latest News: మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భార్య ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టెన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్ లో ఎండి కోర్సులో జాయిన్ చేసి తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కికి రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కాన్వాకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు.
కుమార్తెను ఎండి కోర్సులో జాయిన్ చేసే క్రమంలో లగేజీ ఎక్కువ ఉందని డాక్టర్ సూచి, మధుయాష్కి వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ ఇండియా రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
NDA Leaders Meet at Chandra Babu residence : ఈ సాయంత్రం చంద్రబాబు ఇంట్లో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం
NDA Leaders Meet at Chandra Babu residence :ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో NDA కూటమి నేతల భేటీ కానున్నారు. సమావేశానికి హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారు. SIRపై మూడు పార్టీల నేతలు కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయంపై చర్చిస్తారు. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరుపుతారు.
Kesineni Nani Request: "రాజకీయ కక్షతో నా స్నేహితుడి కుటుంబానికి వేధింపులు" ఆపేయాలని ముఖ్యమంత్రి కేశినేని నాని అభ్యర్థన
Kesineni Nani Request: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ విజ్ఞప్తి చేశారు. తాను రాజకీయాల్లో లేకపోయినా తనపై కక్ష సాధింపులతో తన స్నేహితుడి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. " నేను దాదాపు రెండేళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అయినప్పటికీ, ప్రస్తుత ఎంపీ ప్రేరేపణతో నా చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు నమోదు చేశారు. ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు.
విజయవాడ టాస్క్ ఫోర్స్ PSI నవీన్, రాంబాబు ఇంటికి ఆయన లేని సమయంలో వెళ్లి ఆయన తల్లిని వేధించినట్లు తెలిసింది. ఈ చర్యల వల్ల ఎలాంటి తప్పు చేయని ఒక సాధారణ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. రాజకీయ కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిలువరించి, ఈ వేధింపులను ఆపేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను." అని అభ్యర్థించారు.
కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం! తీసుకునే నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. పలు సంక్షేమ పథకాల అమలుపై కూడా మాట్లాడనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనాల వద్ద మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించనున్నారు.
రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, సాధారణ పౌరులకు న్యాయపరమైన చిక్కులు తప్పుతాయని అంటున్నారు.
అమరావతి పరిధిలోని 9 జిల్లాలతో ఏర్పాటు చేయనున్న అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్‌ఎప్‌పీ ఏర్పాటుకు ఓకే చెప్పనున్నారు. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. రాజధాని రక్షణ కోసం సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లండన్ ఐ తరహాలో అమరావతి జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది రాజధానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తుందని భావిస్తున్నారు.
మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది.
కేబినెట్ ఎజెండా తర్వాత రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం విడివిడిగా మాట్లాడనున్నారు. రెండేళ్ల పాలనపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించనున్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















