Breaking News: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు
Top stories Today | జూన్ 18న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ వార్త అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top News Today | టాప్ న్యూస్ టుడే..
Mancherial District Latest News: మంచిర్యాలలో నీట్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు- సెంటర్‌ను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
Mancherial District Latest News: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పరిశీలించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతోపాటు ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
సిపి మాట్లాడుతూ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలపై చర్చించి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. పరీక్షకు అధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసు సిబ్బంది, మహిళా హోంగార్డులను ఎక్కువ సంఖ్యలో నియమించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరచడం, సమాధాన పత్రాలను సురక్షితంగా తిరిగి డిపాజిట్ చేయడం వంటి ప్రక్రియలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను పూర్తిస్థాయిలో సురక్షితంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయంగా పనిచేస్తారని సీపీ తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. గతంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన కారణంగా ఈ రీ-ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 1,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, వారి కోసం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా, పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరిచే ప్రక్రియలను నిర్దేశిత నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లే, ఈసారి కూడా పోలీసు శాఖ, పరీక్ష నిర్వహణ సంస్థ, విద్యాసంస్థల సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
Kumram Bheem Asifabad District Latest News: బూరుగూడలో ఎరువులు, విత్తనాల దుకాణంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె .హరిత ఆకస్మిక తనిఖీ
Kumram Bheem Asifabad District Latest News: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బురుగూడా గ్రామంలోని కళావతి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న విత్తనాలు, ఎరువుల స్టాక్ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంపై యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని, దుకాణంలో ఏర్పాటు చేసిన బోర్డుపై అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ.. రైతులను మోసం చేసే విధంగా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులు లేదా ఇతర వ్యవసాయ రసాయనాల విక్రయం జరిగితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Kumram Bheem Asifabad District Latest News: ఆసిఫాబాద్ జిల్లాలో దంపతుల అనుమానాస్పద మృతి.! రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Kumram Bheem Asifabad District Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కోసార గ్రామ పంచాయతీ పరిధిలోని భవానీనగర్‌లో బానోత్ రాజు నాయక్ అతని భార్య సునీత నాయక్ మృతి కలకలం రేపింది. వీరి కుటుంబం వ్యవసాయ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో గ్రామంలోని సవారి బంగ్లా వద్ద పూజలు నిర్వహించి తమ ఇంట్లో వరండాలో భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారు. ఇక వేకువజామున మనవరాలు లేచి ఏడవడంతో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని కుటుంబీకులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యనే అని ఆరోపిస్తున్నారు. గత సంవత్సరంలో సవారి ఏర్పాటు విషయంలో బంగ్లా వద్ద గ్రామంలోని ఓ వ్యక్తితో రాజు నాయక్‌కు గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన.. అప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అదే కారణంతో వారిని హత్య చేశారని, ఈ విషయాన్ని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Andhra Pradesh Latest News: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు
Andhra Pradesh Latest News: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడుగా ఉంది. మాజీ మంత్రి కారుమారి నాగేశ్వరరావు నోటీసులు జారీ చేసింది.
Telangana Latest News: రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే
Telangana Latest News: హైదరాబాద్‌లోని రాయదుర్గం భూముల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఎస్‌బీఐ వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు వేలంను స్టే విధించింది. మూడు వారాలపాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్య కాలంలోనే ఈ భూమిని 237 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థ వేలంలో కొనుగోలు చేసింది.
RRR Custodial Case: RRR కస్టోడియల్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు
RRR Custodial Case: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామృష్ణరాజు కస్టోడియల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సునీల్ నాయక్ సరెండర్ అయిపోవాలని కోర్టు సూచించింది.
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- జూన్ 30 రైతు భరోసా నిధులు
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. మధిరలో భారీ బహిరంగ సభ పెట్టి జూన్ 30 నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
Andhra Pradesh Intermediate Supplementary Results 2026: ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల! డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh Intermediate Supplementary Results 2026: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదలచేశారు. ధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా వేదికగా వివరాుల వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లేదా మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్ సదుపాయం కల్పించారు.
Himachal Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో కారు పడి ఏడుగురు మృతి
Himachal Road Accident:హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చంపా దగ్గర లోయలో కారు పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
Gade Saikrishna Missing Case:రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్
Gade Saikrishna Missing Case: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను ప్రభుత్వం నియమించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణలపై విచారణ చేయనున్నా నరసింహా కిషోర్. నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ వెళ్లనున్నారు. 'సాయికృష్ణ బతికి ఉన్నాడో లేదో తెలపాలని' కోరుతున్న తల్లి విజయలక్ష్మి. సాయికృష్ణ మిస్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యుల డిమాండ్.
YSRCP Latest News: నేడు గవర్నర్‌తో వైసీపీ నేతల భేటీ- డీఎస్సీ, సాయికృష్ణ ఇష్యూస్‌పై ఫిర్యాదు!
YSRCP Latest News: నేడు గవర్నర్‌ను వైసీపీ బృందం కలవనుంది. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌తో వైసీపీ నేతల భేటీ అవుతారు. బొత్స ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్న నేతలు, DSC సహా కీలక అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు.
Andhra Pradesh Latest News: అమరావతిలో నేడు క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ నేడు ప్రారంభంకానుంది. ఐబీఎం సహకారంతో అమరావతిలో ఈ అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని రాష్ట్ర యువత, పరిశోధనా సంస్థలతో అనుసంధానించే వేదికగా దీన్ని తీర్చిదిద్దారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఆల్గరిథమ్‌ల అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేయనుంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన, పరిశోధన సామర్థ్యాలను పెంచేందుకు ఈ నెట్‌వర్క్లు ఉపయోగపడనున్నాయి. భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి ఈ కేంద్రం కీలకంగా మారనుంది. ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను అమరావతిలో నెలకొల్పే దిశగా మరో కీలక అడుగు పడనుంది.
Andhra Pradesh Latest News: విధులకు దూరంగా ఉన్న ప్రభుత్వ వైద్యులపై చర్యలు
Andhra Pradesh Latest News: అనధికారికంగా విధులకు దూరమైన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 43 మంది వైద్యులు డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 34 మంది వైద్యులు రాజీనామా చేశారు. సంజాయిషీ నోటీసులు, అభియోగాలు నమోదు చేసినా స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు. వీరందరిని విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.
Nirmal District Latest News: ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులపై తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ కీలక ప్రకటన
Nirmal District Latest News: నిర్మల్ జిల్లా కడెం మండలం గొండుగూడెం గ్రామంలోని ఆదివాసీ మహిళలు, ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడులను, అలాగే అక్రమ అరెస్టులను ఆదివాసి హక్కుల పోరాట సమితి – తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీతరపున తీవ్రంగా ఖండించారు. గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా, గొండుగూడెం, మైసంపేట్ గ్రామాల ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఒకరిపై ఒకరు ద్వేషించుకునే పరిస్థితిని కల్పిస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా భూములకు హద్దులు వేయడం, ఆదివాసీ మహిళలపై ఆదివాసీలపై దాడులు చేయడం, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలని పేర్కొన్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన ఆదివాసులను వెంటనే విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన ఆక్రమణ కేసులను వెంటనే ఎత్తివేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కులను కాలరాస్తూ అధికార యంత్రాంగం వ్యవహరించడం తగదని, ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు వెంటనే జారీ చేయాలని భూ హక్కులను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Latest News: నేడు మూడు జిల్లాల్లో కూటమి విజయోత్సవ సభలు
Andhra Pradesh Latest News: నేడు మూడు జిల్లాల్లో కూటమి విజయోత్సవ సభలు నిర్వహించనుంది. గుంటూరు, ఒంగోలు, కడపలో సభలు ఏర్పాటు చేశారు. కీలక నేతలు ఈ సభల్లో పాల్గొంటారు. ఈ మధ్య తిరుపతిలో గ్రాండ్‌గా విజయత్సోవాన్ని నిర్వహించారు.
Parvatipuram Latest News: ప్రభుత్వ బడిలో కలెక్టర్ కుమారుడు!ఆదర్శంగా ప్రభాకరరెడ్డి!
Parvatipuram Latest News:పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తన కుమారుడు క్రిష్ ధరణ్‌రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసానికి ఇది నిదర్శనంగా మారింది. ఇప్పటికే పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్గులు 590 పైగా మార్కులు సాధించారు.
ట్రెండింగ్ వార్తలు






















