Breaking News: "నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవంగా ఉంటుంది" బండి సంజయ్‌కు రేవంత్ సూచన
Top Stories today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ ఇవాల్టి టాప్ స్టోరీస్‌ను ఇక్కడ చూడవచ్చు. లోకల్ టు గ్లోబల్ అంశాలపై అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE

Background
తెలంగాణలో కొలువుదీరనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్: నేడే తొలి సమావేశం
రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో టీఎన్‌జీఓ, టీజీఓ సహా పలు ప్రధాన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. గత ప్రభుత్వ హయాంలో రద్దయిన ఈ కౌన్సిల్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ గతేడాది పునరుద్ధరించింది. ఈ నెల 2న సీఎంతో జరిగిన చర్చల అనంతరం, ప్రతి రెండు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలనే నిర్ణయం మేరకు నేడు తొలి అడుగు పడనుంది.
ఏపీలో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భాగంగా, మొదటి 10 రోజులు అధికారులకు శిక్షణ ఇస్తారు. అనంతరం నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా పూర్తి చేస్తారు. జులై 21న ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
TDP Latest News: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జోనల్ కో ఆర్డినేటర్లను నియమించిన టీడీపీ
Andhra Pradesh Latest News: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ నూతన జోనల్ కో-ఆర్డినేటర్లను నియమించింది.
అరిమిల్లి రాధాకృష్ణ- శ్రీకాకుళం, విజయనగరం, అరకు
బెందాళం అశోక్- అనకాపల్లి, విశాఖ
సుజయకృష్ణ రంగారావు - కాకినాడ, అమలాపురం
ప్రత్తిపాటి పుల్లారావు- నరసాపురం, ఏలూరు, రాజమండ్రి
MV సత్యనారాయణ రాజు- మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ
బి.టి.నాయుడు- బాపట్ల, నరసరావుపేట
మద్దిపాటి వెంకట రాజు- నెల్లూరు, ఒంగోలు
దామచర్ల సత్య- చిత్తూరు, రాజంపేట, తిరుపతి
రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి - అనంతపురం, హిందూపురం
పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి - కర్నూలు, నంద్యాల, కడప
Telangana Latest News: బండి సంజయ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Latest News: బండి భగీరథ్ పోక్సో కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు విచారణ ఎదుర్కొని బయటపడాలని సవాల్ చేశారు. " బండి సంజయ్ చట్టం ముందు తేల్చుకో.. నీ కొడుకుని నువ్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకొని రా . విచారణ ఎదుర్కో , ఇది సరైన పద్ధతి కాదు. నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవం ఉంటుంది. బండి సంజయ్ కింది స్థాయి నుండి కష్టపడి వచ్చాడు" అని సీరియస్ కామెంట్స్ చేశారు.
.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















