తిరుమల నడక మార్గంలో వంతెన నిర్మాణం ప్రారంభం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వైకుంఠ వాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అధిక శాతం భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. కొందరు శ్రీవారి మెట్టు మార్గంలో వస్తే.. మరికొందరు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. ఓ వైపు అడవి, మరోవైపు సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తూ.. గోవింద నామస్మరణతో భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తారు. ఇంకా చదవండి
కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీలకు అసంతృప్తి బెడద
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించే వారు. అయితే ఆయనను బదిలీ చేశారు. కొత్తగా వైసీపీ నుంచి ఆసిఫ్ సమన్వయకర్తగా నియమించారు. దాంతో వెల్లంపల్లి అనుచరులు అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ, జనసేన కూటమిలో పోత్తులో భాగంగా జనసేన కేటాయించే అవకాశం ఉంది. జనసేన నుంచి పోతిన మహేష్, షేక్ గయాజుద్దీన్ సీటు ఆశిస్తున్నారు. ఇంకా చదవండి
మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం
గిరిజన కుంభమేళా మేడారం (Medaram) మహా జాతర హుండీల లెక్కింపును అధికారులు గురువారం ప్రారంభించారు. పటిష్ట భద్రత మధ్య హనుమకొండ కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దేవాదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో హుండీ ఆదాయం కౌంటింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తొలి రోజే హుండీలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం రేగింది. మొదట ఓపెన్ చేసిన హుండీలో అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంకా చదవండి
సబ్సిడీ గ్యాస్ లెక్కలు తేలాయ్
రాష్ట్ర ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ నెల 27న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా తేల్చింది. ఇంకా చదవండి
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు
అవుటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (RRR)కు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం హెచ్ఎండీఏ (HMDA), పురపాలక శాఖ అధికారులతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై సమీక్ష జరిపారు. మాస్టర్ ప్లాన్ - 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ఇంకా చదవండి