Morning Top News:
రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కావలి సమీపంలోని సిరిపురం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బాపట్ల మెగా పేరెంట్ టీచర్ మీట్ లో లోకేశ్ , చంద్రబాబు హంగామా
బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో తండ్రీ కొడుకులు సరదాగా థగ్ ఆఫ్ వార్ ఆడారు. ఇందులో లోకేశ్ పై చంద్రబాబు జట్టు విజయం సాధించింది. తరువాత జరిగిన సహపంక్తి భోజనంలో సీఎం చంద్రబాబు తిన్న ప్లేట్‌ను మంత్రి లోకేశ్ తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కీలక నేతలనే చేర్చుకునేలా టీడీపీ ప్లాన్
వైసీపీ బలహీనం చేయాడానికి స్ట్రాటజిక్ గా ఆ పార్టీకి చెందిన కీలకనేతల్ని,క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే పార్టీ క్యాడర్ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేదు.ఎవర్నీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో చేరాలనుకున్న వారిని కూడా కొంత కాలం ఆగండి అని ఆపేస్తున్నారు. వైసీపీని నిర్వీర్యం చేయాలంటే నేతల్ని లాగేయాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా పోరంకిలో శనివారం ఏర్పాటు చేసిన ఉర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి రూ.10 లక్షల పెట్టుబడులు రానున్నాయని , భవిష్యత్తులో 1.22 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం రేవంత్ కి అవకాశం ఇచ్చిందా?
తెలంగాణ తల్లి రూపానికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఓ రూపం ఇచ్చింది. ప్రతిమను రెడీ చేసింది. ఆవిష్కరణకు సిద్ధం చేశారు. అంతా అయిపోయిన తర్వాత రూపాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగానే చర్చ పెడితే రచ్చ అవడం తప్ప ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుగానే సిద్ధం చేయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్: జేపీ నడ్డా
గ్యారంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా గారడీలు చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
బీటెక్ స్టూడెంట్, ఓ వివాహితలకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో భార్యను ఆమె ప్రియుడితో చూసిన భర్త దాడికి పాల్పడ్డాడు. చక్కగా చదువుకోకుండా, ప్రేమ పేరుతో పెళ్లయిన ఆడవారి వెంట పడటం ఏంటని బుద్ధిచెప్పారు. వివాహిత భర్త, ఆమె బంధువుల దాడిలో గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆ కుటుంబానికి అండగా ఉంటాం: సుకుమార్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప2' సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ స్పందించారు. 'ఈ ఘటనలో ఒక మహిళా చనిపోవడం అత్యంత బాధాకరం. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము. మా సినిమా ప్రొడ్యూసర్లు, హీరో బన్నీ, నేను అందరం ఆ కుటుంబానికి అండగా ఉంటాము.' అని సుకుమార్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదానీ సంచలన ఆరోపణలు చేశాడు. అధికంగా డబ్బు వస్తుందనే కారణంతోనే ఐపీఎల్లో తమ జట్టును వీడి వెళ్లాడని పేర్కొన్నాడు. నిజానికి ఢిల్లీ జట్టుకు ఆది నుంచి పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలాగానే పంత్ కూడా ఢిల్లీకి చెందినవాడే. దీంతో తనను తీసుకునేందుకు ఢిల్లీ ఉత్సాహం చూపించింది. ఎర్లీ స్టేజ్ లోనే పంత్ ప్రతిభను గుర్తించి, తన ఆటకు మెరుగులు దిద్దింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రోహిత్ నిర్ణయం సరైందేన
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సాహాసోపేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఓపెనింగ్ లో ఆడే రోహిత్, రెండో టెస్టు నుంచి మిడిలార్డర్ లో ఆడుతున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్- రాహుల్ జోడీ ఓపెనింగ్ లో అదరగొట్టడంతో ఆ జంటను విడదీయడం ఇష్టం లేక అడిలైడ్ టెస్టులో ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్ తీసుకున్న ఈ వైఖరిపై దిగ్గజ మాజీ ప్లేయర్లు సునీల్ గావస్కర్, రికీ పాంటింగ్ వాదన చెరో రకంగా ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
Morning Top News: కీలక నేతలనే చేర్చుకునేలా టీడీపీ ప్లాన్ , కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం ఇదేనా వంటి టాప్ న్యూస్
Jyotsna
Updated at:
08 Dec 2024 10:07 AM (IST)
Top 10 Headlines Today:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమంలో జరిగిన ఆసక్తికర సన్నివేశాలు వంటి టాప్ న్యూస్
Todays Top 10 headlines
NEXT
PREV
Published at:
08 Dec 2024 10:07 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -