Morning Top News:
టీడీపీ నేతలపై జగన్ పరువు నష్టం దావా ఫలితం ఇస్తుందా .?
సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో తాను రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. అమెరికాలో దాఖలైన ఎఫ్‌బీఐ చార్జిషీటులో తన పేరు లేదని స్పష్టం చేశారు. తాను అన్ని వివరాలను చెబుతున్నా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని తన ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇంత చేస్తున్నా అమెరికా కేసుపై జరుగుతున్న ప్రచారాన్ని జగన్ ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు రైల్వే శాఖ శుభవార్తం చెప్పింది. ప్రస్తుతం నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమను అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జులై 5వ తేదీన అప్ గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులు
పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటివరకు ఇంటర్నల్‌కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని సర్కారు పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పవన్ ఢిల్లీ టూర్ వెనుక ప్రత్యేక ఎజెండా..!
డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ గడపలేదు. ఈ సారి మాత్రం..నాలుగు రోజుల పాటు డిల్లీలో ఉండి కేంద్ర మంత్రులతో పాటు ప్రధానితోనూ మాట్లాడారు. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. ఎంపీలకు విందు ఇచ్చారు. ఈ టూర్ వెనుక ఖచ్చితంగా ఏదో అంతర్గత ఎజెండా ఉందన్న అభిప్రాయం సహజంగానే రాజకీయవర్గాలకు వస్తుంది. ఎన్డీఏ కూటమి తరపున దక్షిణాది హిందూత్వ ఫేస్‌గా పవన్ కల్యాణ్‌ను ఫోకస్ చేయాలన్న ప్లాన్ లో బీజేపీ ఉందని ఈ దిశగా ఆయనను ఒప్పించేందుకు కసరత్తులు చేస్తోందని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కొండా సురేఖకు కోర్టు సమన్లు
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఆ రోజున జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రిని ఆదేశించింది. కాగా, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను దుమారం రేపాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆర్జీవీ మరో సంచలన ట్వీట్
రామ్‌గోపాల్‌వర్మ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈయన ఓ హాట్ టాపిక్. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రకాశం సహా మరికొన్ని జిల్లాల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా అందుబాటులో లేరు. దీంతో ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా, తనపై నమోదైన కేసులపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దాదాపు 22 పాయింట్లతో కూడిన అంశాలను ట్వీట్ చేస్తూ జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పెంచలకోనలో పులి సంచారం
ఏపీలోని పలు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిరుత సంచారంతో ఆందోళన నెలకొంది. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన అటవీ ప్రాంతంలో కొందరికి చిరుతపులి కనిపించింది. పెంచలకోన దేవస్థానం అటవీ శాఖ పార్కు సమీపంలో అతిథి గృహం వద్ద బుధవారం రాత్రి చిరుత కనిపించింది. గెస్ట్ హౌస్ సమీపంలో బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను గమనించిన వాహనదారులు వీడియోలు తీశారు. కారు హారన్ ఒక్కసారిగా కొట్టడంతో అటవీ ప్రాంతంలోకి పరారైంది. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లిన ఘటనల్లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకటి. అందుకే దానికి గుర్తుగా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు నవంబర్ 29న ఇవాళ బీఆర్‌ఎస్ దీక్షా దివస్ పేరుతో 33 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్‌ఎస్ అగ్రనేతలు పాల్గోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
16 ఏళ్ల లోపు సోషల్ మీడియా నిషేధం
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే దిశగా ఆస్ట్రేలియా పెద్ద అడుగు వేసింది. ఈ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అధిక మద్దతుతో ఆమోదించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాయిటర్స్ కథనం ప్రకారం, గూగుల్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు దీనిని నిషేధించాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ చట్టాన్ని సోషల్ మీడియాకు సంబంధించి ప్రపంచంలోని కఠినమైన నిబంధనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సంబంధించి నిన్న రాత్రి (నవంబర్ 28) ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరిగింది. మహారాష్ట్ర రాజకీయాలపై అమిత్ షా, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఇతర నేతలు చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి పదవి, మంత్రి వర్గ కేటాయింపులపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినప్పటికీ అధికారికంగా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..