Breaking News: ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది, భవిష్యత్తులో చర్చలు జరపం: ట్రంప్
Top stories Today | జులై 8న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు
ఇరాన్‌తో చర్చలు జరపం.. కాల్పుల విరమణ ముగిసింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో సీజ్ ఫైర్ ముగిసిందని, ఇక చర్చించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందని, చర్చల పేరుతో తమ టైమ్ వృథా చేస్తోందన్నారు. నిన్న రాత్రి హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నాకలపై దాడులు జరిగిన తరువాత అమెరికా సైన్యం ప్రతీకార దాడులు చేసింది.
అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూసిన తన అభిమాని నిరంజన్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. వ్యాధితో బాధపడుతూ కూడా తనను చూడగానే నిరంజన్ ముఖంలో విరిసిన చిరునవ్వు, అతను చూపిన ఆత్మవిశ్వాసం ఎప్పటికీ మరువలేనివన్నారు. అంతటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా విడిచి వెళ్లడం తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన చెందారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2026
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ… pic.twitter.com/uQ7ujh3La1
YSR జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళుర్పించిన వైఎస్ జగన్
దివంగత వైయస్‌ఆర్ 77వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇడుపులపాయకి భారీగా తరలివచ్చారు.
దివంగత వైయస్‌ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించిన వైయస్ జగన్ గారు
— YSR Congress Party (@YSRCParty) July 8, 2026
ఇడుపులపాయకి భారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు#77thYSRJayanthi#YSRLivesOn#FarmersDay pic.twitter.com/nWsmnCXlZF
వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు.
రైలులో బుసాన్ కు వెళ్లిన మంత్రి నారా లోకేష్
పారిశ్రామికవేత్తలతో భేటీల అనంతరం తిరిగి సియోల్ రానున్న మంత్రి
సియోల్: దక్షిణ కొరియాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ నుంచి రైలులో బయలుదేరారు. బుసాన్ లో ఏపీఈడీబీ ఆధ్వర్యాన ఈ ఉదయం అపెక్స్ – కొరియా (Andhra Pradesh External Engagement - Korea) పేరిట పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగంను మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. తర్వాత కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (KOMEA) ఆధ్వర్యాన నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. అనంతరం బీఎన్‌కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్, హ్యుంగ్ సాంగ్ గ్రూప్ ఉన్నతస్థాయి బృందాలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాల అనంతరం సాయంత్రం షూఆల్స్ ఫుట్ వేర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం బుసాన్ నుంచి రాత్రికి తిరిగి సియోల్ చేరుకుంటారు.
విజయవాడలో ఉగ్రలింకులపై ఎన్ఐఏ సోదాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విజయవాడలోని వించిపేట ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను ప్రారంభించాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏకకాలంలో రంగంలోకి దిగిన అధికారులు, అనుమానిత ప్రాంతాలలో విస్తృతంగా నిఘా పెట్టి సోదాలు కొనసాగిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక టెర్రర్ లింక్స్ (ఉగ్రవాద సంబంధాల) కేసు దర్యాప్తులో భాగంగానే విజయవాడలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. వించిపేటలోని సదరు అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు అణువణువూ గాలిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను, అలాగే లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు వంటి డిజిటల్ ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు























