Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Top stories Today | జులై 10న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు
"బీజేపీలోకి వెళ్లడం లేదనని భద్రాచలం రాముడిపై ఒట్టేస్తారా" హరీష్‌రావుకి రేవంత్ సవాల్
బీజేపీలోకి ఎప్పుడు దుకుదామా అని హరీష్‌రావు కాచుకొని ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారితో చీకట్లో మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అలా తాను మాట్లాడం లేదని, బీజేపీలోకి వెళ్లడం లేదని భద్రాచలం రాముడిపై కానీ, మామ కేసీఆర్‌పైనైనా ప్రమాణ చేయగలవా అని హరీష్‌రావుకు సవాల్ చేశారు.
Telangana CM Revanth Reddy: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
ఖమ్మం వేదికగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంటుబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించబోరని న్నారు. మమత బెనర్జీ, ఆప్‌ను చీల్చడం, వారు అనుకున్నబిల్లులు ఆమోదించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ పాపంలో వారు విజయం సాధిస్తారని చెప్పారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2029 మే, జూన్‌లో జరుగుతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 26 ఎంపీ సీట్లకు 182 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇందలో కాంగ్రెస్ పార్టీ 117 అసెంబ్లీ సీట్లో అధికారంలోకి వస్తుందని చెప్పారు. భద్రాచలం రాముడి మీద ఒట్టేసి చెబుతున్నా, కాచుకో కేసీఆర్, నీ బలగమంతా గుర్తుపెట్టుకోండి అని సవాల్ చేశారు.
Kodali Nani :కొడాలి నాని ఉప్మా వ్యాఖ్యలపై ఫిర్యాదు
Kodali Nani :రావణ్‌పై పెట్టి ఉపా కేసులో మాజీ మంత్రి, వైసీపీ లీడర్ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తనదైన స్టైల్‌లో ఉపా చట్టమా ఉప్మా చట్టామా అంటూ కామెంట్స్ చేయడంపై టీడీపీ నేతుల ఆగ్రహించారు. దేశ చట్టాలన కించపరిచేలా మాట్లాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టాన్ని హేలన చేయడమే కాకుండా పవన్ పై కూడా నోరు పారేసుకున్నారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Nirmal Latest News: భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
Nirmal Latest News: నిర్మలా జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. 2వ అంతస్తులో ఆడుకుంటున్న రెండేళ్ల పాప కీర్తి సింగ్ బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతి చెందింది. రాజస్తాన్ నుంచి వచ్చిన మాధవ్ సింగ్ - ప్రియాంక దంపతులు భైంసా పట్టణంలోని రాహుల్ నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. బాల్కనీలో ఆడుకుంటున్న పాప ప్రమాదవశాత్తు కింద పడింది. తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ (PTM) వాయిదా!
జూలై 17 నుంచి జూలై 22కు జరగాల్సిన మెగా PTM వాయిదా పడింది. జూలై 22 (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా మెగా PTM నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాలల్లో మెగా PTM పెట్టాలని భావించారు. తాజా షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. మెగా PTMకు సంబంధించిన ఇతర మార్గదర్శకాలు యథాతథంగా అమల్లో ఉంటాయని అన్నారు.
Kumuram Bheem Asifabad Latest News:కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంట్లో చోరీకి వెళ్ళి చిక్కిన దొంగ!
Kumuram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతి నగర్‌లో అర్థరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడగా.. అప్రమత్తమైన స్థానికులు వారిలో ఒకరిని పట్టుకున్నారు. అనంతరం దొంగ చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. అయితే మరో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన దొంగను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇళ్లలోకి దొంగలు చోరీకి యత్నించడంతో కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కాసేపట్లో సమావేశంకానుంది. కీలకమైన విషయాలపై చర్చిస్తారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీకి ముగ్గురు మంత్రులు హాజరుకావడం లేదని సమాచారం అందించారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్... సర్జరీ నిమిత్తం ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. వ్యక్తిగత పర్యటనలో విదేశాల్లో టీజీ భరత్ ఉన్నారు. అందుకే సమావేశానికి హాజరుకావడం లేదని వివరణ ఇచ్చారు.
నేడు ముంబైకి పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ముంబై వెళ్లనున్నారు. భుజానికి చికిత్స కోసం వెళ్లనున్నారు. ఆపరేషన్ తర్వాత పవన్‌కు 30 రోజుల విశ్రాంతి తీసుకుంటారు.
నేడు విశాఖలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
నేడు విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. రాత్రి 7 గంటలకు అధికారులు, సెయిలర్లతో సమావేశం కానున్నారు. రేపు నేవల్ డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకల్లో పాల్గొంటారు. నేవీ అధికారులతో కీలక భేటీ నిర్వహిస్తారు. వేడుకల అనంతరం విశాఖ నుంచి ఢిల్లీకి రాజ్‌నాథ్ సింగ్ వెళ్తారు. ఆయన రాక కోసం విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహేంద్రగిరి కమిషనింగ్‌తో భారత నౌకాదళానికి మరో ఆధునిక యుద్ధనౌక చేరనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















