Most wanted Red sandalwood Smuggling Brothers arrested by Tirupati Taskforce


- పోలీసు యూనిఫాంలో రెడ్ శాండల్‌ స్మగ్లింగ్..
- 89 కేసుల్లో నిందులుగా ఉన్న స్మగ్లర్ బ్రదర్స్
- మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్
- పోలీసు యూనిఫాం, సెల్‌ఫోన్స్, కారు స్వాధీనం..


శేషాచలం అటవీ ప్రాంతంకు సొంతమైన అరుదైన సంపద ఎర్రచందనం. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు కొందరు స్మగ్లర్స్. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు పక్కా వ్యూహంతో ఫోలీసు యూనిఫాంతో ఎర్రచందనం అక్రమ రవాణా (Red sandalwood Smuggling)కు పాల్పడున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ బ్రదర్స్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుండి పోలీసు యూనిఫాం, సెల్‌ఫోన్స్, కారు, ఎర్రచందనం దుంగలలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


మోస్ట్ వాంటెడ్  స్మగ్లర్ బ్రదర్స్ అరెస్ట్ 
తిరుపతి టాస్క్ ఫోర్స్ (Tirupati Taskforce SP) ఎస్పీ చక్రవర్తి వెల్లడించిన‌ వివరాల ప్రకారం.. పోలీసు యూనిఫాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్  స్మగ్లర్ బ్రదర్స్ తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎట్టకేలకు పట్టుకున్నాం. వివిధ జిల్లాల్లో దాదాపు 89 కేసులు ఉన్న ఈ స్మగ్లింగ్ సోదరులను కటకటాల వెనక్కు పంపారు. వారి నుంచి  31ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చెంపతిలాల్ బాషా (36), షేక్ చంపతి జాకీయర్ (27)లు  గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు. చాలా కాలం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా చేపట్టిన వ్యూహం ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపారు.


31ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ 
ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో సీఐ రామకృష్ణ, ఆర్ ఐ చిరంజీవులు టీమ్ ఏర్పేడు సమీపంలోని కృష్ణాపురం, మల్లెమడుగు, కరకంబాడి ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. కరకంబాడి ఫారెస్ట్ బీట్ అమర్ రాజా ఫ్యాక్టరీ విన్జియో కంపెనీ వద్ద కారుతో నిలబడి ఉన్న స్మగ్లర్ల ను గమనించారు. పట్టుకునేందుకు వెళ్లడంతో పారి పోవడానికి ప్రయత్నించారు. ఆర్ఎస్ఐ రాఘవేంద్ర మరికొంత మంది పోలీసులు చుట్టుముట్టి పట్టుకోవడానికి గలిగారు. వీరిని అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించారు. నిందితుల నుంచి 31ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కారులో పోలీసు యూనిఫాంను కూడా గుర్తించారు. పోలీసు యూనిఫాం వేసుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను హైజాక్ చేసి, ఇతర రాష్ట్రాలకు అమ్మేవారని తెలిపారు. 31ఎర్రచందనం దుంగలు విలువ 20లక్షలు ఉంటుందని తెలిపారు. ఆపరేషన్ లో పాల్గొన్న వారికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు.