Chain Snatchers in UP: రీల్స్‌... సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్‌. ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సోషల్‌ మీడియా అకౌంట్‌ తప్పనిసరిగా ఉంటుంది. అందులో పెట్టే వీడియోలు, రీల్స్‌ చేసేవాళ్లు ఎంత మందో. నచ్చితే లైకులు కూడా  ఇస్తూ ఉంటారు. ఇలా వచ్చే... లైక్స్‌, వ్యూస్‌ కోసం రీల్స్‌ చేసే వాళ్లు చాలా మంది. చేతిలో ఫోన్‌ ఉంటే చాలు... ఒక వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. అంతేకాదు... లైక్స్‌, వ్యూస్‌ కోసం సహసాలు కూడా చేస్తుంటారు కొంతమంది.


వెరైటీ  కంటెట్‌ కోసం పిచ్చి వేషాలు వేస్తుంటారు. ఇంకొంత మంది... పిచ్చిపిచ్చి ఐడియాలతో వీడియోలు తీసి పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల కాలంలో... రోడ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రాంతాలను కూడా వదలడంలేదు... రీల్స్‌  పిచ్చోళ్లు. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేస్తూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్‌లో అందరి ముందు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలు కూడా తీసుకున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్న వారి తీరు  వివాదాస్పదమవుతోంది. రీల్స్‌ కోసం ఇలా పిచ్చిపిచ్చి పనులు చేయొద్దని వారికి సూచిస్తున్నారు మెట్రో అధికారులు. 


వెరైటీగా రీల్స్ చేద్దామనుకుంటే.. 
తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో విచిత్ర సంఘటన జరిగింది. వెరైటీగా రీల్స్‌ చేద్దామనుకున్న ఓ మహిళ... రోడ్డుపై వీడియో తీసుకుంటుండగా... బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని చైన్‌ లాక్కెళ్లారు. ఆమెకు దిమ్మతిరిగే షాక్‌  ఇచ్చాడు. యూపీలోని ఘజియాబాద్‌ (Ghaziabad)లో ఈ సంఘటన జరిగింది. ఇంద్రాపుర్‌ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. నిన్న (ఆదివారం) ఉదయం రహదారి పక్కనే ఉన్న సర్వీస్‌  రోడ్డులో రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించింది. కొంచెం దూరంలో కెమెరా పెట్టుకుంది. కెమెరా వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి... ఆమె మెడలోని బంగారపు గొలుసు లాక్కెళ్లిపోయాడు. రీల్స్‌ చేస్తున్న సుష్మా...  తేరుకునేలోపే... అతను దారిదాపుల్లో లేకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఆమె షాక్‌కు గురైంది. రీల్స్‌ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుందామె. ఈ వీడియో... ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు  మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ గొలుసు లాక్కెళుతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శిస్తున్నారు.






లైక్స్‌, వ్యూస్‌ కోసం తాపత్రయం 
వెరైటీ రీల్స్‌ కోసం ప్రయత్నించి... ఇలా బొక్కబోర్లా పడుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం.. వారు పడుతున్న తాపత్రయం... వారి కొంప ముంచుతోంది. చేతిలో ఫోన్‌, కెమెరా ఉంటే చాలా... రీల్స్‌ కోసం రోడ్డెక్కేస్తున్న వాళ్లకి  ఇదో గుణపాఠం అంటున్నారు నెటిజన్లు. కంటెంటె కోసం పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇస్తే... ఎలాంటి ఎదురుదెబ్బలే ఎదురవుతాయని కామెంట్లు పెడుతున్నారు. రీల్స్‌ చేయాలనుకోవడం తప్పుకాదు... కానీ, అందు కోసం అర్థంపర్థం లేని పనులు  చేయడమే... ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికైనా... ముందు వెనుక చూసుకుని... ఏది అవసరం, ఏది అనవసరం అని ఆలోచించి రీల్స్‌ చేసుకుంటే మంచిది అన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా.. రోడ్డుపై రీల్స్‌ కోసం ప్రయత్నించింది...  గోల్డ్‌ చైన్‌ పోగొట్టుకుంది ఆ మహిళ. ముందు కెమెరా ఉందన్న భయం కూడా లేకుండా... ఆమె మెడలో చైన్‌ లాక్కెళ్లాడా దొంగ.