అన్వేషించండి

Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?

Thalapathy Vijay Sangeetha Rumours: తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు సీఎం దళపతి విజయ్, ఆయన భార్య సంగీత మళ్లీ ఒకటయ్యారంటూ వస్తున్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.

Vijay Trisha Relationship Gossip:  తమిళనాడు సీఎం విజయ్  వ్యక్తిగత జీవితంపై గత కొన్ని గంటలుగా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ప్రచారం జోరందుకుంది. విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కారు.  అయితే, వీరిద్దరూ తమ మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కనబెట్టి మళ్లీ ఒక్కటయ్యారనే  వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, విజయ్ అభిమానులు మాత్రం ఈ వార్తలను సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు.    

గతంలో విజయ్ నటించిన సినిమాల ఆడియో లాంచ్‌లకు, సక్సెస్ మీట్‌లకు రెగ్యులర్‌గా హాజరయ్యే సంగీత.. గత కొంత కాలంగా విజయ్ పబ్లిక్ లైఫ్‌లో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన  టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభలకు, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరుకాకపోవడంతో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనే వార్తలకు బలం చేకూరింది. సంగీత లండన్‌లోనే ఉండిపోయారని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ తమిళనాడు మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దానికి తగ్గట్లుగానే సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. 

ఈ మధ్య కాలంలో త్రిషతో కలిసి విజయ్ పలుమార్లు కనిపించారు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చెప్పుకోవడం ప్రారంభించారు. అయితే ఈ విషయంపై వారెవరూ మాట్లాడలేదు.   తాజా సమాచారం ప్రకారం సంగీతతో  విజయ్ అభిప్రాయభేదాలను పరిష్కరించి  వీరిద్దరినీ కలపడానికి కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు తెలుస్తోంది.ఈ జంటను తిరిగి ఒకటి చేయడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని తమిళనాడు పొలిటికల్, సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇరుపక్షాల మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలను తొలగించి, వారి రాజకీయ,  వ్యక్తిగత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్దలు నచ్చజెప్పినట్లు సమాచారం.   

ఈ చర్చలు సఫలం కావడంతోనే సంగీత ఇటీవల లండన్ నుండి తిరిగి చెన్నైకి చేరుకున్నారని, ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరూ కలిసి సమయాన్ని గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యుల జోక్యంతో ఈ స్టార్ కపుల్ మళ్లీ పూర్వపు సంతోషకరమైన జీవితంలోకి అడుగుపెట్టారని కోలీవుడ్ ఇన్‌సైడర్స్ చెప్తున్నారు. ఈ పునరుద్ధరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. గతంలో విజయ్ ,  ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌లను ముడిపెడుతూ వచ్చిన పాత రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో నెటిజన్లు రకరకాల మీమ్స్, పోస్టులతో హల్చల్ చేశారు. అయితే, విజయ్ కానీ, త్రిష కానీ ఆ వార్తలను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు.   ఇప్పుడు సంగీత రీ-ఎంట్రీతో ఆ పుకార్లన్నింటికీ శాశ్వతంగా చెక్ పడినట్లయిందని అంటున్నారు.

ప్రస్తుతానికి ఈ రీ-యూనియన్  వార్తలపై విజయ్ కార్యాలయం నుండి కానీ, లేదా ఆయన కుటుంబ సభ్యుల నుండి కానీ ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. విజయ్ ప్రస్తుతం  తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్నారు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget