సామాజిక భద్రత పేరుతో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్
2019లో ఎన్నికల్లో నవరత్నాల(Navaratnalu 2019) పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024(YSRCP Manifesto 2024)ను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈసీ కీలక నిర్ణయాలు- ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు- పింఛన్ల పంపిణీకీ సూచనలు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు విధులను బదలాయించిన ఎన్నికల సంఘం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఎన్నికలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కొరత ను అధిగమించేందుకు ఎన్నికల సంఘం.. అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలింగ్ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ - తొలి పోస్టులు ఇవే
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాల్లేవు. గతంలో ముఖ్యమంత్రి తరపున సీఎంవో ఖాతా ఉండేది. ఇప్పుడు మాజీ అయినందున ఆయన తన అభిప్రాయాలను తెలిపే సోషల్ మీడియా ఖాతా లేకుండా పోయింది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు.. తమ పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కనెక్టింగ్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండాలనుకుంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
విజయాలకు పొంగిపోయి అపజయాలకు కుంగిపోయే పార్టీ బీఆర్‌ఎస్ కాదని... ప్రజల కోసం ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జెండా ఎగరేశారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌గా ప్రయాణం ప్రారంభించి బీఆర్‌ఎస్‌గా రూపొంతరం చెందిన పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు కేటీఆర్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అనంతపురం అర్బన్ శాంతించిన టీడీపీ అసమ్మతి నేతలు - అభ్యర్థితో కలిసి ప్రచారం
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులను ప్రకటించేంతవరకు ఆయన పేరు ఎక్కడ వినిపించలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం బగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికే టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి