Paragliding Accident: పారాగ్లైడింగ్ సరదా ఓ యువతి నిండు ప్రాణాలను బలితీసుకుంది. పైలట్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదవశాత్తు వందల అడుగుల పైనుంచి కిందకుపడి ప్రాణాలు విడిచింది. హిమాచల్ ప్రదేశ్(Himachalpradesh) లోని కులూ(Kulu)లో జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణ(Telangana)కు చెందిన యువతి కన్నుమూసింది.


విహార యాత్రలో విషాదం


గాల్లో చక్కర్లు, వందల అడుగుల ఎత్తులో విహారం, దూదిపింజలా తేలిపోతున్న శరీరం. ఇవన్నీ మాటల్లో చెబితే సరిపోదు పారాగ్లైడింగ్(Paragliding) అనుభవించి తీరిన వారికే అర్థమవుతుంది. ఎత్తైన కొండల మీద నుంచి లోయలోకి దూకడం, ఎగిరే విమానం డోరు తెరుచుకుని బయటకు దూకేయడం వంటివి మనం సినిమాలో చూస్తుంటాం. ఆ వెంటనే గొడుగు వంటి పరికరం తెరుచుకుని గాల్లో అలా అలా విహరిస్తుంటారు. దీన్నే పారాగ్లైండింగ్(Paragliding) అంటారు. ఈ ఆట ఎంత సరదాగా ఉంటుందో అజాగ్రత్తగా ఉంటే అంతకన్నా ప్రమాదకరంగా ఉంటుంది. ఊపిరి సినిమా చూశాం కదా..అందులో నాగార్జున(Nagarjuna) వందల అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ఎలా జీవచ్ఛవంలా మారిపోయాడు. వందలకోట్లు ఉండి కూడా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. కనీసం అక్కడ నాగార్జున బ్రతికే ఉన్నాడు. కానీ కొంతమంది అక్కడికక్కడే మృతిచెందుతారు. సరిగ్గా అలాంటి ఘటనలే హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో జరిగింది. తెలంగాణలోని జహీరాబాద్(Jahirabad) కు చెందిన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పారాగ్లైడింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఈ ఘటన జరిగింది.తెలంగాణలోని జహీరాబాద్ కు చెందిన నవ్య(Navya) పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాల్లో నుంచి కిందపడిపోయి కన్నుమూసింది. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మోహన్, నవ్య దంపతులు విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ లోని కులూ వెళ్లారు. నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా పైలట్(Pilot) అజాగ్రత్తగా వ్యవహరించి సీట్ బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది.


ఫైలట్ నిర్లక్ష్యం


నవ్య ప్రమాదానికి గురైన ప్రాంతం పారాగ్లైడింగ్ కు ఎంతో అనువైన ప్రదేశమే. వందల మంది యాత్రికులు ఇక్కడ గాల్లో విహరించి ఆనందం పొందారు. అయితే కేవలం మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కులూ పోలీసులు నిర్థరించారు. పైలట్ టూరిస్ట్ సేప్టీ బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడం వల్ల నవ్య జారికిందపడిపోయిందని తెలిపారు. పారాగ్లైడింగ్ కు అన్ని సేప్టీ మెజర్ మెంట్స్ ఉన్నాయని....పైలట్ కూడా పారాగ్లైడింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవాడేనని తేల్చారు. అయితే అజాగ్రత్తే పర్యాటకురాలి ప్రాణాలు తీసిందని వారు తెలిపారు.మృతదేహానికి కులు ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ప్రమాదానికి కారణమైన పైలెట్ పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కులులోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. ఆనందంగా గడిపేందుకు విహార యాత్రకు వెళితే విషాదం చోటుచేసుకుందని నవ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పర్యాటక ప్రాంతాల్లో సేప్టీ ఫ్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే నవ్య చనిపోయిందని..మరొక కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు 


Also Read: మేడిగడ్డలో దెబ్బతిన్న పిల్లర్లను సీఎం రేవంత్ నేడు పరిశీలించనున్నారు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రాజెక్ట్ సందర్శిన


Also Read: టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ తుది ఆన్సర్ కీ విడుదల, సమాధానాలు చెక్ చేసుకోండి