CM Vijay: లంచం అడిగితే వీడియో తీయండి.. రూ. 1 లక్ష గెలుచుకోండి! తమిళనాడు సీఎం విజయ్ మెగా ఆఫర్
TVK Vijay: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన నిర్ణయం తీసుకున్నారు విజయ్. ఇప్పుడు ఎవరైనా లంచం అడగాలంటే భయపడాల్సిందే.

Corruption Free Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై అవినీతిపై పోరాడే 'దళపతి'గా పేరు తెచ్చుకున్న విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. ఒక్క వీడియో తీసి పంపితే చాలు, మీ అకౌంట్‌లో రూ. 1 లక్ష నగదు చేరుతుంది!
రాష్ట్రంలో లంచగొండితనాన్ని వేళ్లతో సహా పెకిలించేందుకు విజయ్ ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్, మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. సామా న్య ప్రజలు ఇకపై అధికారుల వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని, మీ స్మార్ట్‌ఫోనే మీ ఆయుధమని సీఎం స్పష్టం చేశారు.
Tamil Nadu CM Vijay announced a ₹1 lakh reward for anyone who submits video proof of government staff asking for bribes 💰🚫
— Swapnil Kommawar (@KommawarSwapnil) May 20, 2026
The move is aimed at directly exposing corruption inside government offices.
If implemented strictly, this could become one of the boldest…
24 గంటల్లోనే బహుమతి.. స్పాట్ సస్పెన్షన్!
ఈ పథకం అమలు తీరు అత్యంత పారదర్శకంగా ఉండనుంది. లంచం అడుగుతున్న వీడియోను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒక ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ 24 గంటల్లోపు ఆ వీడియో వాస్తవికతను పరీక్షిస్తుంది. వీడియో నిజమని తేలితే, ఫిర్యాదు చేసిన పౌరుడికి వెంటనే రూ. 1 లక్ష రివార్డు అందజేస్తారు. లంచం అడిగిన ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసి, కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
CM Vijay will award ₹1 lakh
— 🚨Indian Gems (@IndianGems_) May 20, 2026
To anyone who submits video evidence of govt staff seeking bribes.
This could be a landmark move to tackle corruption.🔥 pic.twitter.com/ZFsHO0K2Xy
ప్రతి పౌరుడూ ఒక నిఘా నేత్రం
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులు, యజమానులు కాదు" అనే నినాదంతో విజయ్ ఈ పథకాన్ని రూపొందించారు. కేవలం రూ.100 లేదా రూ.500 లంచం అడగాలన్నా అధికారులు వణికిపోయేలా ఈ నిబంధనలు ఉండనున్నాయి. ప్రతి పౌరుడిని ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా మార్చడం ద్వారా పాలనలో జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని కక్షపూరిత ఫిర్యాదులు లేదా ఫేక్ వీడియోలు చేసే వారిపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. స్క్రీనింగ్ కమిటీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి మార్ఫింగ్ చేసిన వీడియోలను గుర్తిస్తుంది. తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై తిరుగుటపాలో కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం తమిళనాట యువతలో విపరీతమైన జోష్ నింపుతోంది. సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడంలో విజయ్ తొలి అడుగులోనే సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















