Tamil Nadu govt to introduce bill banning Hindi: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, హిందీ భాషపై నిషేధం విధించే చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా హిందీలో హోర్డింగ్స్ , బోర్డులు, సినిమాలు, పాటలు, పబ్లిక్ ఈవెంట్‌లలో హిందీ ఉపయోగాన్ని నిషేధిస్తుంది. ఈ బిల్‌ను అసెంబ్లీలో స్టాలిన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టం తీసుకు వస్తున్నామని చెబుతున్నారు. తమిళ భాష, సంస్కృతి రక్షణకు కట్టుబడి ఉందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ బిల్ ప్రకారం: హోర్డింగ్స్, బోర్డులు: పబ్లిక్ ప్రదేశాల్లో, వ్యాపారాల్లో హిందీలో ప్రకటనలు, సైన్‌బోర్డులు నిషేధం. తమిళ భాషను ప్రాధాన్యత ఇవ్వాలి. సినిమాలు, పాటలు: థియేటర్లలో, పబ్లిక్ ఈవెంట్‌లలో హిందీ సినిమాలు, పాటలు ప్రదర్శించడం, ప్లే చేయడం బ్యాన్. తమిళ సినిమాలు, పాటలకు ప్రోత్సాహం. ఇతర నిషేధాలు: రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా హిందీ ఉపయోగం శిక్షార్హం. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ బిల్‌ను రూపొందించడానికి లీగల్ ఎక్స్‌పర్టులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఇప్పటికే నిర్వహించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి కె. పొన్ముడి ఇది తమిళ భాషకు గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమేనని చెబుతున్నారు. ఈ చట్టం ఆమోదం పొందితే, భారతదేశంలో భాషా సంబంధిత చట్టాల్లో అత్యంత కఠినమైనది అవుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా 'త్రీ-లాంగ్వేజ్ ఫార్ములా' (తమిళ, ఇంగ్లీష్, హిందీ)ను డీఎంకే వ్యతిరేకిస్తోంది. డీఎంకే దీన్ని 'హిందీ బలవంతంగా రుద్దడం'గా చూస్తోంది. హిందీ నేర్చుకోవాలని బలవంతం చేస్తే తమిళుల ఆత్మగౌరవంతో ఆడుకోవడమేనని స్టాలిన్ చెబుతున్నారు. తమిళనాడు 'టూ-లాంగ్వేజ్ పాలసీ' (తమిళ, ఇంగ్లీష్) వల్ల విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్‌లో ముందుందని ఆయన పేర్కొన్నారు.ఈ మేలకు పాలసీని కూడా తీసుకు వచ్చారు.
బీజేపీ ఈ చర్యను 'అసాధారణం, రాజకీయ డైవర్షన్'గా విమర్శించింది. తమిళనాడులో హిందీ వ్యతిరేకత 1930లు, 1950ల అంటీ-హిందీ ఆందోళనల నుంచి మొదలైంది. ఈ బిల్ 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినందున, ఓటర్ల పోలరైజేషన్‌కు దారి తీస్తుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు.