Puspha Sofa Model in Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు వెండితెరను మించిన ఉత్కంఠను రేపుతున్నాయి. అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, సభలో జరిగిన సోఫా చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి, వారి మద్దతు కూడగట్టడానికి సోఫా రాయబారం నడిపారని ఆరోపించడం ఈ కొత్త వివాదానికి తెరలేపింది.
అసలేమిటీ సోఫా కథ?
ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో అన్నాడీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీలోని ఒక వర్గం నేత ఇంటికి రాత్రికి రాత్రే ఒక సరికొత్త సోఫా డెలివరీ అయింది. ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ సోఫా వెనుక ఏముందో? ఏయే డీల్స్ కుదిరాయో? అంటూ చమత్కరిస్తూనే ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేను అవినీతి పార్టీ అన్న విజయ్, ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు. ఉదయనిది ఈ మోడల్‌కు సోఫా మోడల్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలోనూ విమర్శలు చేస్తున్నారు.
పుష్ప సినిమా రిఫరెన్స్
ఎదుకంటే పుష్ప సినిమాలో సోఫాలో డబ్బులు పంపి పంచాలుగా పంపిస్తూ ఉంటారు. విజయ్ సర్కార్ అనేది ఒక రీల్స్ గవర్నమెంట్ లా ఉండకూడదు, ప్రజల కోసం పనిచేసే రియల్ గవర్నమెంట్ లా ఉండాలి అని ఎద్దేవా చేశారు. కేవలం సినిమా గ్లామర్, సోషల్ మీడియా హంగామాతో ప్రభుత్వం నడవదని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 25 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం. ఇది పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు పెద్ద దెబ్బ కాగా, విజయ్‌కు వరంలా మారింది. డీఎంకే మాత్రం ఈ మార్పును అక్రమ పొత్తు గా అభివర్ణిస్తోంది.
సోషల్ మీడియాలో మీమ్స్
తమిళనాడు శాసనసభలో ఇకపై ఉదయనిధి స్టాలిన్ మరియు విజయ్ మధ్య జరిగే ఈ మాటల యుద్ధం, భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో 'సోఫా' మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
