Car Falls Into River In Goa:
దక్షిణ గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్‌పై నుంచి ఓ ఎస్‌యూవీ కార్ జువారీ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కార్‌లో నలుగురు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో పాటు నేవీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది నదిలో పడిపోయి వారిని గాలించింది. గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ మొత్తానికి ముగిసింది. నదిలో పడిపోయిన కార్‌ను వెలికి తీశారు. కార్‌లో ఉన్న నలుగురి కోసం మాత్రం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధరించారు. నదిలో గల్లంతైన వాహనం కోసం గాలింపు చేపట్టారు. పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొర్టాలిమ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కార్‌ను ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపు తప్పి నదిలో పడిపోయినట్టు భావిస్తున్నారు. బ్రిడ్డ్ రెయిలింగ్స్ పై నుంచి దూసుకుపోయి నేరుగా నదిలో పడిందని అంచనా వేస్తున్నారు. ఓ మహిళ కార్ నడుపుతున్నారని, అందులో మరో ముగ్గురు ఉన్నారని ఈ ప్రమాదాన్ని చూసిన వ్యక్తి ఒకరు వెల్లడించారు.