అన్వేషించండి

Supreme Court on Reservation: తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

IAS Officers Children Quota: రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాల పిల్లలకు మళ్లీ కోటా ఎందుకని సుప్రీం ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్ల అవసరంపై కొత్త చర్చ ప్రారంభమయింది.

Creamy Layer Exclusion SC: రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ప్రయోజనాలు ఎందుకని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని క్రీమీ లేయర్  మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.  

 ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లా? 

రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి సమాజం ఎప్పుడు బయటపడుతుందనే అంశంపై సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. విద్యాపరమైన,  ఆర్థికపరమైన సాధికారత వచ్చినప్పుడు, సమాజంలో సామాజిక హోదా దానంతట అదే మారుతుందని ధర్మాసనం పేర్కొంది.  ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే, వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు  ఒక తరం రిజర్వేషన్ల ఫలాలు పొంది ఉన్నత స్థాయికి చేరాక, మళ్లీ వారి పిల్లలు కూడా కోటా కోరితే ఈ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.

 సామాజిక మార్పు - ఆర్థిక ఎదుగుదల   

రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లో  సామాజిక  స్థిరత్వం వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉంటూ, గౌరవప్రదమైన ఆదాయం సంపాదిస్తున్నప్పుడు వారి పిల్లలు రిజర్వేషన్ల పరిధి నుంచి స్వచ్ఛందంగా బయటకు రావాలని సూచించింది. సామాజికంగా వెనుకబడిన వారందరికీ న్యాయం జరగాలంటే, ఇప్పటికే లబ్ధి పొందిన ఉన్నత వర్గాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు గుర్తు చేసింది.  

 క్రీమీ లేయర్ మినహాయింపుల వివాదం 

కర్ణాటకలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి, క్రీమీ లేయర్ కింద తనను మినహాయించడాన్ని సవాలు చేస్తూ ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ చర్చ జరిగింది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే కారణంతో రిజర్వేషన్ నిరాకరించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, క్రీమీ లేయర్‌ను మినహాయించడం రాజ్యాంగపరమైన నిబంధన అని, దీని ద్వారానే నిజమైన వెనుకబడిన వర్గాలకు ఫలాలు అందుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

 ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాపై స్పష్టత 

విచారణలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల  రిజర్వేషన్ల గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చేదని, అందులో సామాజిక వెనుకబాటుతనం అనే కోణం ఉండదని జస్టిస్ నాగరత్న వివరించారు. ఓబీసీ రిజర్వేషన్లలో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ప్రాధాన్యమని, అయితే ఒకసారి ఆ స్థాయిని దాటిన తర్వాత మళ్లీ కోటా కోరడం సమంజసం కాదని పేర్కొంది.

 నోటీసులు జారీ 

రిజర్వేషన్ల ఫలాలు ఒకే వర్గానికి లేదా ఒకే కుటుంబంలోని తరతరాలకు పరిమితం కాకూడదని కోర్టు అభిప్రాయపడింది. సమాజంలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే రిజర్వేషన్ల అర్హతలపై నిరంతర సమీక్ష జరగాలని సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని భావించిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్
హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget