Air India crash survivor Stunning video: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన మండుతున్న శిథిలాల నుండి బయటకు వచ్చిన కొత్త పడిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171, ఒక బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే, జూన్ 12, 2025న మధ్యాహ్నం 1:38 గంటలకు కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు , 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇది టేకాఫ్ తర్వాత 33 సెకన్లలో అహ్మదాబాద్‌లోని మేఘనీనగర్‌లో ఉన్న BJ మెడికల్ కాలేజీ హాస్టల్‌లోకి ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది, అలాగే భవనంలో ఉన్న 5 మంది వైద్య విద్యార్థులతో సహా 33 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 274కి చేరుకుంది.
విమానంలోని ఇతర ప్రయాణికుల డెడ్ బాడీల్ని గుర్తించడానికి డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఇంతా భారీ ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడ్డారు. విశ్వాస్ కుమార్ రమేష్, 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు. ఈ ప్రమాదంలో ఏకైక బతికిన వ్యక్తి. అతను సీటు 11Aలో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమీపంలో కూర్చున్నాడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, రమేష్ రక్తం మరకలతో కూడిన షర్ట్‌తో, మండుతున్న శిథిలాల నుండి నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. స్థానికులు అతన్ని గుర్తించి, అతని చేయి పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు . ఈ వీడియో వైరల్‌గా మారిందది.
అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లోని వార్డు B7, బెడ్ 11లో చికిత్స పొందుతున్న రమేష్ తాను కూర్చున్న వైపు (విమానం ఎడమ వైపు) హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌పై ఢీకొంది. అక్కడ నుంచి అతను బయటకు రాగలిగాడు. విమానం మరొక వైపు భవన గోడకు ఢీకొనడం వల్ల ఇతరులు బయటపడలేకపోయారు. రమేష్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు. అతను ఈ ప్రమాదంలో సోదరుడ్ని రమేష్ కోల్పోయాడు.