Star Link internet devices in Manipur: మణిపూర్‌లో అరాచకం సృష్టిస్తున్న కొంత మంది వ్యక్తుల్ని ఇటీవల ఆర్మీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలతో పాటు స్టార్ లింక్ ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకునే పరికరాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అందులో స్టార్ లింక్ డివైజ్ కూడా ఉంది.
ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ ను అందిస్తున్నారు. మన దేశంలో ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినా ఎలా స్టార్ లింక్ ఉపయోగిస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది. ఎలాన్ మస్క్ దొంగ చాటుగా మణిపూర్ లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ఇంటర్నెట్ ను ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఎలాన్ మస్క్ నేరుగా స్పందించారు. ఆర్మీ ప్రకటించిన అంశం ఫేక్ అని.. స్టార్ లింక్ ఇంటర్నెట్ ...మణిపూర్ లో అందుబాటులో ఉండదని ప్రకటించారు.
మణిపూర్ లో ఇంటర్నెట్ ను బ్యాన్ చేశారు. అక్కడ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తరచూ తీవ్రమైన హింస జరుగుతోంది. ఈ కారణంగా ఇంటర్నెట్ ను అందుబాటులోకి ఉంచలేదు. అయితే స్టార్ లింక్ ద్వారా సేవలు పొందడం మాత్రం అనుమానాస్పదమవుతోంది. భారత్ కానీ.. భారత పొరుగుదేశాల్లో కాని స్టార్ లింక్ అందుబాటులో లేదు.
ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని..ఆర్మీ ఎందుకు పట్టుకోలేకపోతోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఫేక్ అని చెప్పినంత మాత్రాన వదిలేయ కూడదని విచారణ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.