Ayodhya Rama celebrations In Telugu States :   అయోధ్య రామాలయ ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోను పలు చోట్ల పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.  బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు,హోమం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు.   సికింద్రాబాద్ మారేడ్ పల్లి , బోయిన్పల్లి  వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కాలనీలు ,అపార్ట్మెంట్లు, దేవాలయాలు ముస్తాబయ్యాయి. పెద్ద ఎత్తున ర్యాలీలలో పాల్గొన్న శ్రీరాముని భక్తులు ఉదయం నుండి రామనామ సంకీర్తనతో ప్రారంభించి రోజు మొత్తం అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
 
పలు చోట్ల భారీ స్క్రీన్స్ ఏర్పాటు 


అయోధ్య లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని, గుడిని సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. టెంపుల్ వద్ద ఉదయం 6 గంటలకే శ్రీరామ నామస్మరణతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రామనామ భజన చేశారు. 500 సంవత్సరాల రామమందిరం కల నెరవేరడంతో  దేశవ్యాప్తంగా హిందువులు రాముని  సేవలో నిమగ్నమయ్యారు. అయోద్యలో బాలరాముని   ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులతో ఆలయాలు శ్రీరాముని నామస్మరణ లో మార్మోగుతున్నాయి. ప్రతి ఆలయంలో రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అయోద్యలో జరుగుతిన్న ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యేక్షంగా తిలకించడానికి భారీ స్క్రిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 


ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు


వరంగల్ నగరంలో ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. కూడల్లో రాముడి భారీ కట్ ఔట్ లు ఏర్పాటు చేశారు. రాముడి విగ్రహాలతో కోలాటాలు, భజనలతో శోభయాత్ర నిర్వహించారు. ఆలయాలకు భక్తులు సంప్రదాయ దుస్తువులతో తరలివచ్చారు. పట్టణాలేకాదు. పల్లెలు కూడా పండుగ వాతావరణం సంతరించుకుంది. పల్లె పట్నం అనే తేడాలేకుండా కాషాయం జెండాలు కనిపిస్తున్నాయి. ఇక ఇళ్లపై శ్రీరాముడి జెండాలను ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు హిందూవులు మరో సారి దీపావళి జరుపుకోబోతున్నారు. సాయంకాలం సమయంలో ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి రాముడి సేవలో తరించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక శోభసంతరించుకుంది. బోయినపల్లి కంసాలి బజార్  లోని అతి పురాతనమైన శ్రీ రామాలయం లో ఏర్పాటుచేసిన కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ రాములవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారినిఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు   సూరారం లోని శివాలయం నగర్ హనుమాన్ టెంపుల్ లో అంగరంగ వైభవంగా శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు,హోమం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు.  


కరీంనగర్‌లో సైకత శిల్పం ఏర్పాటు 


అయోధ్య అనగానే టక్కున గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్లో రాముడు జన్మించిన జన్మస్థలం. అయితే నేడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నేరుగా వెళ్లి చూడలేని వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో ఓ శిల్పకళాకారుడు కేవలం ఇసుకతో రెండు రోజులు శ్రమించి సైకత రూపంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అయోధ్యకు అందరూ వెళ్లలేరు కాబట్టే కరీంనగర్ లోని భక్తజనుల కొరకు మహాశక్తి ఆలయంలో ఈ సైకత రూపాన్ని తయారు చేశాం..ఇది నాకు దక్కిన అదృష్టంంగా భావిస్తున్నా అని అన్నారు. 10 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో  రెండు రోజుల వ్యవధిలో ప్యూర్ స్యాండ్ తో ఈ అయోధ్య రామాలయ సైకత రూపాన్ని తయారు చేశాం అని అన్నారు సైకత శిల్పి వెంకటేష్..