Congress Plenary Session:


ప్లీనరీ సమావేశం..


కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు. 


"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు" 


-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు 










మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు..


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపించిన తీరుని ప్రశంసించారు సోనియా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనూ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని అన్న సోనియా గాంధీ...కాంగ్రెస్ కేవలం పార్టీ మాత్రమే కాదని, ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావు ఉందని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 


"ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే కాదు. దేశమే సవాలు ఎదుర్కొంటున్న సమయం. దేశంలోని ప్రతి సంస్థను బీజేపీ ఆర్ఎస్‌ఎస్‌ హస్తగతం చేసుకున్నాయి. కేవలం కొందరు బడా వ్యాపారుల కోసం ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు" 


- సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు