Soham Parekh: స్కాక్ మార్కెట్ స్కాంతో కేతన్ పరేఖ్ గురించి అందరికీ తెలుసు. కానీ సోహం పరేఖ్ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు తెలిసేలా చేశారు. ఆ కేతన్ పరేఖ్‌కి.. ఈ సోహంపరేఖ్‌కు సంబంధం లేదు. మోసాలు కూడా భిన్నం. సోహమ్ పరేఖ్..స్టార్టప్ కంపెనీల యజమానులకు నిద్రలేని రాత్రులు కల్పిస్తున్న ఓ ఉద్యోగి మాత్రమే.
సోహమ్ పరేఖ్ ఒక్కడే .. ఒకే సారి చాలా సార్టప్‌లలో పని చేస్తూ జీతాలు తీసుకుంటున్నాట. రోజుకు రెడు లక్షలు చొప్పున ఏటా ఏడు కోట్లు సులువుగా వెనకేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు.
మిక్స్‌ప్యానెల్ సహ-వ్యవస్థాపకుడు సుహైల్ దోషి సోహమ్ పరేఖ్ పై ట్వీట్ పెట్టాడు. పరేఖ్ Y కాంబినేటర్ (YC) స్టార్టప్‌లను లక్ష్యంగా చేసుకున్నాడని .. ఇతర కంపెనీల్లో పని చేస్తూ.. తన కంపెనీలో చేరాడని తెలిపారు. పరేఖ్‌ను తన కంపెనీలో ఒక వారంలోనే తొలగించానని.. మోసం చేయడం ఆపమని హెచ్చరించినప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నాడని దోషి ట్వీట్‌లో తెలిపారు.
దోషి ట్వీట్ ను చూసి ఫ్లీట్ AI సహ-వ్యవస్థాపకుడు నికోలాయ్ ఓపోరోవ్ కూడా స్పందించారు. పరేఖ్ సంవత్సరాలుగా బహుళ స్టార్టప్‌లలో పనిచేస్తున్నాడని ధృవీకరించాడు. లిండీ CEO ఫ్లో క్రివెల్లో, పరేఖ్‌ను ఒక వారం క్రితం నియమించుకుని, ఆరోపణల తర్వాత తొలగించినట్లు చెప్పాడు. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్‌హర్స్ట్, పరేఖ్ 2022లో తమ మొదటి ఇంజనీర్‌గా చేరాడని, అతను తెలివైనవాడు , ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పాడు. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని తెలిసిన తర్వాత తీసేశామన్నారు. మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ , వార్ప్ ప్రొడక్ట్ హెడ్ మిచెల్ లిమ్ కూడా పరేఖ్‌తో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్నారు.
పరేఖ్ రెజ్యూమే ప్రకారం ముంబై విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (9.83 GPA). జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అతను డైనమో AI, యూనియన్ AI, సింథెసియా, అలాన్ AI, ఫ్లీట్ AI, యాంటిమెటల్, మరియు గిట్‌హబ్‌లో ఓపెన్ సోర్స్ ఫెలోగా పనిచేసినట్లు తన CVలో పేర్కొన్నాడు.
అద్భుతమైన ప్రతిభావంతుడు కానీ.. ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేస్తున్నందుకు తీసేశామని ఇతరులు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది మద్దతు లభిస్తోంది. కొందరు పరేఖ్‌ను “కార్పొరేట్ మజ్దూర్” అని, మరికొందరు “వోల్ఫ్ ఆఫ్ YC స్ట్రీట్” అని పిలుస్తున్నారు. కొందరు అతని ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెచ్చుకున్నారు. ఇతరులకు మూడు గంటలు పట్టే పనిని పరేఖ్ గంటలో పూర్తి చేస్తారని ప్రశంసలు వచ్చాయి.
సోహమ్ పరేఖ్ బహిరంగంగా స్పందించలేదు, కానీ దోషికి ప్రైవేట్‌గా మెసెజ్ పంపినట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలు “సోహమ్-గేట్” అని పిలుస్తున్నారు.