Social media star Manish Kashyap loses badly : బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025లో ఎన్‌డీఏ భారీ విజయం సాధించింది. యూట్యూబ్ సెన్సేషన్ మనీష్ కశ్యప్ మాత్రం ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు యూట్యూబ్‌లో 9.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మనీష్, పశ్చిమ చంపారణ్ జిల్లా చాన్‌పటియా నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ జన సూర్య పార్టీ (జేఎస్‌పీ) టికెట్‌పై పోటీపడ్డారు. కానీ, కేవలం 37,172 ఓట్లు మాత్రమే పొంది, విజేత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్‌కు 50,366 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూట్యూబ్ పాపులారిటీ ఎన్నికల్లో పనిచేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ మరో వైపు బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్‌ను కేవలం 602 ఓట్ల తేడాతో ఓడించారు. మనీష్ కశ్యప్ మూడో స్థానంలో నిలిచారు,. మనీష్ పొందిన 37,172 ఓట్లు ఆయన యూట్యూబ్ ఫాలోయింగ్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మనీష్ కశ్యప్ అసలు పేరు త్రిపురాలి కుమార్ తివారి. యూట్యూబ్‌లో 'బీహారీ బాయ్'గా ప్రసిద్ధి చెందారు. బీహార్ పాలిటిక్స్, సామాజిక సమస్యలు, యూత్ ఇష్యూస్‌పై వీడియోలు చేస్తూ 9.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు, 1.5 బిలియన్ వ్యూస్ పొందారు. 2024లో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలో చేరి, చాన్‌పటియా నుంచి పోటీపడ్డారు. ప్రచారంలో "బీహార్ మార్పు కావాలి" స్లోగన్‌తో యూవీ ఓటర్లను ఆకర్షించారు. మనీష్ కశ్యప్ 1994లో పశ్చిమ చంపారణ్ జిల్లా బెత్తియా సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మనీష్, బీఏ పూర్తి చేసి జర్నలిజం చేయాలనుకున్నారు. 2018లో యూట్యూబ్ ఛానల్ 'మనీష్ కశ్యప్' ప్రారంభించారు.బీహార్ గ్రామీణ సమస్యలు – రోడ్లు లేకపోవడం, విద్యుత్ కట్‌లు, ఉపాధి లేకపోవడం వంటి వాటిపై సాధారణ భాషలో, లైవ్ రిపోర్టింగ్‌తో ఆకర్షణ పెంచారు. 2019లో బీహార్ ఫ్లడ్స్ సమయంలో గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. "బీహార్ బాయ్" అనే ట్యాగ్‌తో వీడియోలు వైరల్. 2020 నాటికి 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లు. మార్చి 2023లో తమిళనాడులో బీహార్ మైగ్రెంట్ లేబరర్స్ పై దాడులు జరుగుతున్నాయని..తమిళనాడులో బీహారీలను కొట్టి చంపుతున్నారు" అని వీడియోలు పోస్ట్ చేశారు. బీహార్‌లో ఆందోళనలు, రాజకీయ పార్టీలు రియాక్ట్ అయ్యారు. నీతీష్ కుమార్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు. మనీష్ ఛానల్ సబ్‌స్క్రైబర్లు 3 మిలియన్ నుంచి 9.6 మిలియన్‌కు పెరిగాయి. తర్వాత తమిళనాడు పోలీసులు "ఇది ఫేక్ న్యూస్" అని ప్రకటించారు. తమిళనాడు పోలీసులు మనీష్ పై NSA కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. బీహార్ పోలీసులు కూడా ఫేక్ న్యూస్ కేసులు పెట్టారు. 45 రోజులు జైలులో ఉండి రిలీజయ్యారు.
ఫిబ్రవరి 2024లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెత్తియా లేదా వాల్మీకినగర్ సీటు కోరారు, కానీ బీజేపీ ఇవ్వలేదు. మార్చి 2024లో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలో చేరారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో చాన్‌పటియా నుంచి టికెట్ పొందారు. ఎన్నికల్లో 37,172 ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ మొత్తం 238 సీట్లకు పోటీ చేసినా ఒక్క సీటూ గెలవలేదు. మనీష్ ఓటమి "యూట్యూబ్ పాపులారిటీ ఎన్నికల్లో పనిచేయదు" అనే సందేశాన్ని ఇచ్చింది. ఆయన ఎక్స్‌లో "ఓటమి మాకు పాఠం, మార్పు కొనసాగుతుంది" అని పోస్ట్ చేశారు.