Airbags Mandatory:


ప్యాసింజర్ కార్లలో మాండేటరీ..


ప్యాసింజర్ కార్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. "ఎంత విలువైన కార్‌లో ప్రయాణిస్తున్నారనేది పక్కన పెట్టేసి...ప్రతి ప్రయాణికుడి ప్రాణానికి భద్రత ఉండేలా చూడాల్సిందే" అని ట్వీట్ చేశారు గడ్కరీ. ఇందుకు సంబంధించిన డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను ఇప్పటికే కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచే...8 సీట్లున్న M1 కేటగిరీ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా తయారు చేయాలని స్పష్టం చేసింది. అయితే...ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కారణంగా...ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాస్త కుదేలైంది. మునుపటిలా స్పేర్ పార్ట్స్‌ దొరకటం లేదు. కార్ల తయారీ కూడా కాస్త మెల్లగా సాగుతోంది. డిమాండ్ పెరుగుతున్నా..అందుకు తగ్గట్టుగా సప్లై ఉండట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఇదే విషయాన్ని నితిన్ గడ్కరీ కూడా వివరించారు. "సప్లై చెయిన్‌లో సమస్యల కారణంగా...ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే..6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలన్న నిబంధనను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించాం" అని ట్వీట్ చేశారు. 











ఈ నిబంధన బాగానే ఉన్నా...వినియోగదారులపై భారం పడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కార్ల ధరలు ప్రియమైపోయాయి. తయారీ ధరలు పెరగటం వల్ల ఈ మధ్య కాలంలో కార్ల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తే ఆ మేరకు కాస్ట్ పెరుగుతుంది. కొన్ని కంపెనీలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వాదిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు...కేంద్రం ఆదేశాల ప్రకారం ఇప్పటికే తయారీలో మార్పులు చేర్పులు చేయటం మొదలు పెట్టాయి. 
వాహన తయారీదారులు వెనుక సీట్లకు కూడా సీటు బెల్ట్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ గతంలో వెల్లడించారు.