Siddaramaiah Police Contro: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగ సభలో పోలీస్ అధికారిపై చేయి ఎత్తిన ఘటన కలకలం రేపుతోంది.సోమవారం బెళగావిలోఈ ఘటన జరిగిదంి. బెళగావిలో సిద్ధరామయ్య ఒక బహిరంగ సభలో ప్రసంగించేందుకు వేదికపై ఉన్నారు. సిద్ధరామయ్య ప్రసంగం సమయంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు సభా ప్రాంగణం వెలుపల నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ నిరసన కారణంగా స్వల్ప గందరగోళం ఏర్పడింది, దీంతో సిద్ధరామయ్య ప్రసంగానికి ఆటంకం కలిగింది. నిరసన కారణంగా ఏర్పడిన గందరగోళాన్ని అదుపు చేయడంలో విఫలమైనందుకు సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆయన సభా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని వేదికపైకి పిలిచారు.  ఆగ్రహంతో సిద్ధరామయ్య చేయి ఎత్తి పోలీస్ అధికారిపై కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆగిపోయారు. సిద్ధరామయ్య తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

ఈ ఘటనను బీజేపీ, జేడీఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సిద్ధరామయ్య వ్యవహార శైలిని అధికార దుర్వినియోగంగా, అమర్యాదకరంగా పేర్కొన్నాయి.  

సిద్ధరామయ్య ఇటీవలి కాలంలో అనేక వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని  చెప్పారని.. పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్నారని ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన మాటలకు వ్యతిరేకంగా బీజేీప కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు.   సిద్ధరామయ్య ఈ ఘటనపై బహిరంగంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ వర్గాలు ఈ ఘటనను నిరసన కారణంగా ఏర్పడిన క్షణిక ఆవేశంగా తేలికగా తీసుకునే ప్రయత్నం చేశాయి. 

సిద్ధరామయ్య తీరు సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సీఎం స్థానంలో ఉండి  బహిరంగంగా పోలీస్ అధికారిపై చేయి ఎత్తడం ఆయనకు హుందాతనం లేదని  తేలిపోయిందని అంటున్నారు.  సిద్దరామయ్య వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూండటం కాంగ్రెస్ పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. భూ వివాదంలో ఈడీ కేసుల నుంచి బయటపడినా.. సీఎం మార్పు గురించి తరచూ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన వివాదాల్లో ఉండటం ఆయన అనుచరుల్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది.