18 th July 2024 News Headlines in Telugu For School Assembly: 


1. తెలంగాణలో రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. లక్ష రూపాయలలోపు రైతు రుణాలను మాఫీ చేయనున్నారు. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. లక్ష జమ కానున్నాయి. రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు చేయనున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.


2. తెలంగాణలో వీది కుక్కల బెడదను నివారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ జవహర్‌ నగర్‌లో కుక్కల దాడిలో బాలుడు మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల దాడులపై అధ్యయనానికి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 


3. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు తొలి ఏకాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం నివాసంలోకి అడుగుపెట్టారు. 2014లోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే నివాసంలో బస చేశారు.


4. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్‌లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటాలో మొత్తం 1,36,660 సీట్లు ఉండగా.. 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 16నే పూర్తి కావాల్సి ఉండగా ఒక రోజు ఆలస్యమైంది. 24 గవర్నమెంట్‌ యూనివర్సిటీ కాలేజీల్లో 6,877 సీట్లకు గాను 6,189 సీట్లు నిండాయి. ప్రైవేటు కాలేజీల్లో 1,21,951 సీట్లకు 1,03,247 భర్తీ అయ్యాయి. 


5.  ప్రైవేట్‌ ఉద్యోగాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానిక కన్నడిగులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ ;చేయడం కలకలం రేపింది. అనంతరం ఆయన దాన్ని తొలగించారు. పాలనలో 50... గ్రూపు సీ, డీ ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని మళ్లీ పోస్ట్‌ చేశారు.  సర్వాత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. 


6. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంట్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మావో అగ్రనేతలు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


7. చైనాలో పలు కంపెనీల నిర్వాకం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. మహిళలకు ఉద్యోగం ఇచ్చేముందు పలు కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయించడం కలకలం రేపుతోంది. ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. దీనిపై చైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


8.  ఒలింపిక్స్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తేలింది. 117 మంది ఇండియన్స్‌ అథ్లెట్లు విశ్వ క్రీడల్లో తలపడనున్నారు. పతకం ఆశలు రేపుతూ వీరంతా పారిస్‌ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్నారు. నీరజ్‌ చోప్రా, సింధు సహా షూటింగ్‌, ఆర్చరీలపై భారత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. 


9. అమెరికా పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తర్వాత పుట్టిన వారికి కూడా  ఆ వ్యాధి వచ్చే అవకాశం 20శాతం వరకు ఉందని తేల్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో 1,600 మంది పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చారు.


10. అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు..