2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరును పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విభజనను సవాల్ చేసే సమయం మించిపోయినప్పటికీ ... ఇతర ముఖ్యమైన అంశాలపై విచారణ చేపట్టాల్సి వుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంత్రి పదవి రాలేదని ఫీల్ అయ్యా- రాజీనామాపై బాలినేని క్లారిటీ
ఇతర అంశాలను ఒకరోజు జాబితా చేయాలని, త్వరలో విచారణ చేపడతామని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కొహ్లిలు పేర్కొన్నారు. చట్ట ప్రకారం 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో చట్టం చేశారు. విభజనను సవాల్ చేస్తూ... ఎపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పిటిషన్ వేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి కూడా పిటిషన్ వేశారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించిన వివాదాస్పద విదానాన్ని సవాలు చేస్తూ 2014లో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఎపి విభజన చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్‌లలో పేర్కొన్నారు.
బాలినేని బాధ్యతలు పెద్దిరెడ్డికి - తానేటి వనితకు హోం, ఆ ఇద్దరి శాఖలు ఎక్స్చేంజ్
గత వారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుకుమార్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ధర్మాసనం ముందు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ పై త్వరలోనే విచారణను చేపడుతామన్నారు. ఈ వారంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా పిటిషన్ ను పొందుపర్చేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు. ఆ మేరకు ఇవాళ విచారణ జరిపారు.
జగన్ 2.0 కేబినెట్ - మంత్రుల శాఖలివే!
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జతగా ఈ సవరణ పిటిషన్‌ను ఉండవల్లి తరఫు న్యాయవాది రమేశ్ అల్లంకి దాఖలు చేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే దాన్ని ప్రకటించాలని కోరారు. భవిష్యత్‌లో ఏదైనా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాటించేందుకు తగిన మార్గదర్శకాలివ్వాలని కోరారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం మద్దతిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. విభజనను సవాల్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇతర అంశాలపై విచారణ జరగనుంది .