Save Soil Movement :  సద్గురు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమం అంతర్జాతీయ  గుర్తింపును పొందనుంది.  ప్రతిష్టాత్మక వెబ్బీ అవార్డ్ కోసం ఆసియా నుండి సేవ్ సాయిల్ ఉద్యమం ముందంజలో నలిచింది.  2023 వెబ్బీ అవార్డ్స్ మరియు వెబ్బీ పీపుల్స్ వాయిస్ అవార్డులకు సేవ్ సాయిల్ ఉద్యమాన్ని  నామినేట్ చేశరు. ప్రపంచంలో సమాజం కోసం జరిగే మంచి పనులు, ఉద్యమాలను గౌరవించడానికి ఈ పురస్కారాలిస్తారు. ఇలాంటి కేటగరిల్లో ఇదే ప్రపంచంలోనే అత్యుత్తతమైన పురస్కారం.  2023 వెబ్బీ అవార్డ్స్ మరియు వెబ్బీ పీపుల్స్ వాయిస్ అవార్డులకు నామినేట్ అయిన  ఏకైక ఉద్యమం సేవ్ సాయిల్. ఉద్యమం ప్రస్తుతం అవార్డు పొందడానికి ముందంజలో ఉంది.  80% ఓట్లతో ఆధిక్యంలో ఉంది.


వెబ్బీ అవార్డ్స్ నామినీలను న్యూయార్క్‌కు చెందిన ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఆర్ట్స్ & సైన్సెస్  ఎంపిక చేస్తుంది.  అకాడమీలో మాజీ వెబ్బీ విజేతలు , నామినీలు ఉంటారు.  అలాగే  ఇతర ప్రసిద్ధి చెందిన కార్పొరేట్ ప్రముఖులు ఉంటారు. అయితే వీరంతా పర్యావరణాన్ని కాపాడే సంస్థలకు చెందిన వారై ఉంటారు.  సేవ్ సాయిల్ ఉద్యమం వెబ్బీ పీపుల్స్ వాయిస్ అవార్డు  ఉత్తమ సామాజిక ప్రచారం - సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో నామినేట్ చేశారు.  ప్రజల నుండి అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ ఓట్లను పొందిన ఉద్యమాన్ని వేజేతగా ప్రకటిస్తారు. 
ఈ విషయంలో సేవ్ సాయిల్ ఉద్యమం అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తోంది. 


సద్గురు  స్థాపించిన న్షియస్ ప్లానెట్ - సేవ్ సాయిల్ ఉద్యమం మానవాళి ఎదుర్కొంటున్న విపత్కర నేల క్షీణతపై దృష్టిని తీసుకురావాలనే లక్ష్యంతో ప ని చేస్తోంది.  మట్టిని పునరుజ్జీవింపజేయడానికి మొత్తం 193 దేశాలలో ప్రభుత్వ విధానాలను  మార్పు కోసం సద్గురు లక్ష్యంగా పెట్టుకున్నారు.  మార్చి 2022లో, సద్గురు 100 రోజుల, 30000-కిమీల ప్రయాణాన్ని 27 దేశాలలో ఒంటరిగా మోటర్‌సైకిల్ పై ప్రయాణించారు.  ప్రభుత్వ పెద్దలు, ప్రభావశీలులు , సాధారణ ప్రజలను కలుసుకుని, అవగాహన పెంచారు. విధాన మార్పులను సిఫార్సు చేయడానికి అధ్యయనం చేశారు.    3.91 బిలియన్ల ప్రజలకు చేరువైన అతిపెద్ద ప్రజా ఉద్యమంగా సేవ్ సాయిల్  అవతరించింది.    63 దేశాలలో 3 మిలియన్ల మంది పిల్లలు కూడా తమ దేశ నాయకులకు లేఖలు రాశారు, ప్రపంచ నేల యొక్క భయంకరమైన పరిస్థితి ,  దానిని రక్షించాల్సిన తక్షణ అవసరాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. 


సేవ్ సాయిల్ ఉద్యమం ప్రారంభించినప్పటి నుండి, 81 దేశాలు నేల పునరుజ్జీవనానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చాయి.   గ్లోబల్ ఫోరమ్‌లలో మట్టి ఒక ముఖ్యమైన సమస్యగా మార్చి చర్చిస్తున్నారు.  పాలసీలు ,  ఆన్-గ్రౌండ్ యాక్షన్ ద్వారా నేల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి  మెరుగుపరచడానికి అనేక దేశాలు ఉద్యమంతో చేతులు కలపడంతో సేవ్ సాయిల్ ప్రభావం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉది. భూమిని పునరుజ్జీవన ప్రయత్నాలను వేగవంతం చేయడానికి కాన్షియస్ ప్లానెట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో కలిసి పని చేస్తూనే ఉంది.


వెబ్బీ అవార్డుల గురించి:


1996లో  ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెబ్బీస్ అవార్డును ప్రారంభించింది.   2000+ సభ్యుల జడ్జింగ్ బాడీ ఈ సంస్థకు ఉంటుంది.   అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు-ప్రముఖ ఇంటర్నెట్ నిపుణులు, వ్యాపార ప్రముఖులు, ప్రముఖులు, దూరదృష్టి గలవారు  సృజనాత్మక ప్రముఖులు కమిటలో ఉంటారు. అలాగే  మాజీ వెబ్బీ విజేతలు, నామినీలు మరియు ఇతర ఇంటర్నెట్ నిపుణులు అయిన అసోసియేట్ సభ్యులు ఉంటారు.  ప్రతి సంవత్సరం, వెబ్బీ పీపుల్స్ వాయిస్ అవార్డ్స్ ప్రపంచం నలుమూలల  నుండి మిలియన్ల మంది ఓట్లు వేస్తారు. 


సేవ్ సాయిల్ గురించి సమాచారం  ఈ వెబ్ పోర్టల్ చూడవచ్చు. : Savesoil.org