లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ఛానెల్ నేడు ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలిసి ఈ ఛానెల్‌ను ప్రారంభించారు.
ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ హృదయం లాంటిది. మీడియా.. కళ్లు, చెవులు వంటివి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే - వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఏళ్లు గడిచేకొద్ది మీడియా పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని మీడియా ముందుకువెళ్తుంది. సంసద్ టీవీ.. ఓటీటీ, సోషల్ మీడియా వేదికల్లోనే కాక యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఇలాంటి రోజు సంసద్ టీవీ ప్రారంభించడం చాలా మంచి విషయం. ప్రజాస్వామ్యానికి భారత్ అమ్మలాంటిది. ప్రజాస్వామ్యమనేది మనకు జీవధార లాంటిది. - నరేంద్ర మోదీ, ప్రధాని
ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలుపుతూ సంసద్ టీవీ ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలతో పాటు సమచారాత్మక కథనాలను ఇందులో ప్రసారం చేయనున్నారు.