Roka at metro station: మెట్రో స్టేషన్‌లో ఎంగేజ్‌మెంట్ - అసలు కథ ఇది !
Metro engagement : ముంబై మెట్రోస్టేషన్ లో జరిగిన ఓ ఎంగేజ్‌మెంట్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో వెనుక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ భిన్నమైన ప్రేమ కథ ఉంది.

Unusual engagement ceremony at metro station: సోషల్ మీడియాలో మెట్రోలో నిశ్చితార్థం చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది. కొంత మంది లవర్స్ దొరికిపోతే ..తల్లి అక్కడిక్కకడే రోకా అంటే నిశ్చితార్థం చేశారని కొందరు.. కొందరు ఏదో గొడవలు అయితే సర్ది చెప్పుకుని అక్కడే ఆ పని పూర్తి చేశారని మరికొందరు అంటున్నారు. కానీ నిజం మాత్రం వేరే అని ఆ కుటుంబానికి చెందిన వారు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెట్రో స్టేషన్ నిశ్చితార్థం వీడియో వెనుక ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది ఏదో సరదాకో లేక రీల్స్ కోసమో చేసిన పని కాదు; ప్రేమ, పట్టుదల , కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక హైడ్రామాకు నిదర్శనం. ఆ నిశ్చితార్థం వెనుక ఉన్న భావోద్వేగాలను గమనిస్తే, అది ఏ సినిమా సీన్‌కూ తక్కువ కాదనిపిస్తుంది. నిశ్చితార్థం కోసం ఒక అందమైన హాలు సిద్ధంగా ఉన్నా, కేవలం ఒక మొండి పట్టుదల కారణంగా ఈ వేడుక మెట్రో ప్లాట్‌ఫారమ్‌కు మారింది.
అసలు విషయం ఏమిటంటే, నిశ్చితార్థానికి వెళ్లాల్సిన సమయంలో పెళ్లి కూతురు తండ్రి , పెళ్లికూతురుకు మధ్య ఒక విషయంలో గొడవ జరిగింది. ఆ కోపంలో ఆమె మెట్రో స్టేషన్‌కు వచ్చేసింది. కానీ, ఆ జంట మధ్య ఉన్న ప్రేమ, వారి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదంటే.. ఆ గొడవను అక్కడికక్కడే ముగించి, శుభకార్యాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు. ఫలితంగా, అందమైన వెడ్డింగ్ హాల్‌లోకి వెళ్లాల్సిన బంధుమిత్రులంతా మెట్రో స్టేషన్‌కే చేరుకున్నారు.
#viralvideo वीडियो किसी फिल्म का सीन नहीं बल्कि असल जिंदगी का एक यादगार पल है, जिसमें प्यार, परिवार, गुस्सा, इंतजार और जिद सब कुछ एक साथ नजर आ रहा है। खास बात यह है कि यह रोका और रिंग सेरेमनी किसी मैरिज हॉल या घर में नहीं बल्कि सीधे एक मेट्रो स्टेशन पर होती है।#metro #engagement pic.twitter.com/lVNEgGdspr
— Riti Gupta (@ritigupta900) February 8, 2026
ఎదురుచూపులు, కన్నీళ్లు, కోపం.. వీటన్నింటి మధ్య చివరకు ఆ జంట అక్కడే ఉంగరాలు మార్చుకున్నారు. ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న బెంచీలే పీటలయ్యాయి, మెట్రో అనౌన్స్‌మెంట్ల మధ్యే రోకా పూర్తిచేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆ జంట మొండితనానికి, వారి కుటుంబం చూపిన చొరవకు ఫిదా అయిపోయారు. విలాసవంతమైన భవనాల్లో జరిగే వేడుకల కంటే, మనసు కలిస్తే ఎక్కడైనా అది ఒక మధుర జ్ఞాపకమే అవుతుందని ఈ సంఘటన నిరూపించింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమ ఉంటే ప్లాట్‌ఫారమ్ కూడా తాజ్ మహల్ లాగే కనిపిస్తుంది అని కొందరు కామెంట్ చేస్తుంటే, ఇది నిజంగా రియల్ లైఫ్ డ్రామా " అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఒక చిన్న మొండితనం వల్ల మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ రోకా ఆ కుటుంబానికి, ఆ జంటకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అరుదైన అనుభవంగా మిగిలిపోయింది.























