Warangal Car Accident: వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరే క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోనీ రాఅమారం, లక్నపల్లి గ్రామాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబం కారు లో వేములవాడ దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ కారుపై పడడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో నలుగురు ఉండగా నాగరాజు మృతి చెందగా.. శ్రీకాంత్, సంధ్య, లలితకు తీవ్రగాయాలు గాయాలయ్యాయి. మృతదేహంతో పాటు క్షగాత్రులను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. నాగరజు మనుమడు పుట్టు వెంట్రుకలు తీయడానికి వేములవాడ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కూతురు కుటుంబాన్ని హన్మకొండ లో దింపి రామారానికి బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
Warangal News: వరంగల్లో రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం - పలువురికి గాయాలు
ABP Desam
Updated at:
28 Jan 2024 09:18 AM (IST)
Warangal News: వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోనీ రాఅమారం, లక్నపల్లి గ్రామాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు