B.V. Pattabhiram passes away:  డాక్టర్ బీవీ పట్టాభిరామ్  గా ప్రసిద్ధి చెందిన బొడ్డుపల్లి వెంకట పట్టాభిరామ్ కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.  బీవీ పట్టాభిరాం భారతదేశంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, మానసిక సలహాదారు, హిప్నాటిస్ట్,  మెజిషియన్‌గా పేరు తెచ్చుకున్నారు.   హైదరాబాద్‌లో  ప్రశాంతి కౌన్సెలింగ్ & HRD సెంటర్ ద్వారా మూడు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు,  కుటుంబాలకు వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిలో ఎదిగేందుకు స్ఫూర్తినిచ్చారు.  

బీవీ పట్టాభిరామ్ ఓస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ ,  ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్ చేశారు.  గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో పీజీ డిప్లొమా,   యోగా & హిప్నాటిజం  లో పీహెచ్‌డీ చేశారు.  సాఫ్ట్ స్కిల్స్, లీడర్‌షిప్, కమ్యూనికేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్-కాన్ఫిడెన్స్,  మోటివేషన్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు భారతదేశంతో పాటు యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్,  అరబ్ దేశాలలో కూడా జరిగాయి.

ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని ప్రశాంతి ఎసి ఆడిటోరియంలో వ్యక్తిత్వ వికాసంపై కార్యక్రమం నిర్వహించేవారు.  హిప్నాటిస్ట్ మరియు ఇంద్రజాలికుడిగా కూడా గుర్తింపు పొందారు. హిప్నాటిజం ద్వారా స్ట్రెస్, భయాలను అధిగమించడంలో  సాయం చేసేవారు.  వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్-హెల్ప్, మోటివేషన్‌పై అనేక పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలు తెలుగు, ఇంగ్లీష్,  ఇతర భారతీయ భాషలలో అందుబాటులో ఉన్నాయి.

లాఫ్టర్ థెరపీ, వజ్రాసనం, ఇతర రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా స్ట్రెస్‌ను అధిగమించాలని ఆయన బోధించేవారు.  పట్టాభిరామ్ భారతదేశంలో వ్యక్తిత్వ వికాస రంగంలో గణనీయమైన ప్రభావం చూపారు. డిజిటల్ ఎరాలో కూడా  యూట్యూబ్ ఛానెల్ మరియు సోషల్ మీడియా ద్వారా లక్షల మంది  ఫాలోయర్లను సంపాదించుకున్నారు.   ఆయన బోధనలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, కుటుంబాలకు స్ఫూర్తినిచ్చాయి.