Rayapati Rangababu Resigns to TDP: టీడీపీకి చెందిన రాయపాటి రంగబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగబాబు. తాను సత్తెనపల్లి నుంచి సీటు ఆశించానని, కానీ.. అది వేరొకరికి కేటాయించారని అన్నారు. ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లుగా కనీసం తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు. ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా.. టీడీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్ర పటాన్ని రాయపాటి రంగారావు విసిరిపారేశారు.


తమ కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది టీడీపీనే అని అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ మాట్లాడారు. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానంటూ రంగారావు ఛాలెంజ్ చేశారు. కియా కంపెనీ తానే తెచ్చారని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారని.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పనితో తన తండ్రి రాయపాటి సాంబశివరావు చాలా ఆవేదన చెందారని.. ఈ వయసులో ఆయన ఏమీ చేయలేకున్నారని అన్నారు.