Ravi Telugu Travellar: ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. కానీ ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారు.  ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో రవిప్రభు ఒకరు. విశాఖకు చెందిన రవి 195 దేశాల్లో  పర్యటించి ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. 


195 దేశాల్లో పర్యటించిన రవి ప్రభు 
 
ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ పర్యటించిన వారు  కేవలం 280 మంది ఉన్నారు. వారిలో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి  రవి.  195వ దేశంగా వెనిజులాను ఈ మధ్యనే సందర్శించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగినట్లుగా  అధికారింగా గుర్తింపు కూడా లభించింది.  రవి ప్రభు సోషల్ మీడియా ద్వారా తన ప్రయాణాలను డాక్యుమెంటరీ చేస్తారు. ‘రవి తెలుగు ట్రావెలర్’ యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతారు.  దీని మీద ఆయన ఆదాయాన్ని చూసుకోరు.  ప్రపంచవ్యాప్తగా అన్ని దేశాల్లో పర్యటించడానికి ఇప్పటి వరకూ రూ. పాతిక కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. పూర్తిగా వ్యక్తిగత అభిరుచి మేరకే తాను అన్ని దేశాలను పర్యటించానని చెబుతూంటారు.  



పదేళ్ల వయసులో తొలి సారి భూటాన్ పర్యటన 


రవి తల్లిదండ్రులు తనకి పదేళ్లు ఉన్నప్పుడడు భూటాన్ టూర్ కు తీసుకెళ్లారు. అదే అతని మొదటి పర్యటన. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ చూడటాన్ని ఓ హాబీగా పెట్టుకున్నారు. అయితే ఆయన చదువును నిర్లక్ష్యం  చేయలేదు. మంచి చదువు చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు.  తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించాడు. తన పర్యటనల్లో ఎదుర్కొన్న సంస్కృతులు, వంటకాలు మరియు వ్యక్తులతో సహా. ప్రతి  చోట అందాలను తన కెమెరాలో బంధించి  ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారిని ఆకట్టుకునే యూట్యూబ్ లో పెట్టేవారు.  విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉన్నత చదువులు చదివారు. తర్వాత కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం సాధించారు. 


యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్    


రవి తెలుగు ట్రావెలర్‌కు యూట్యూబ్‌లో ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.  రవి తన ఛానెల్ ద్వారా వివిధ దేశాల ప్రజల విభిన్న సంస్కృతులు , జీవనశైలిలో   భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తారు.  1000కు పైగా విమానయాన సంస్థలలో 30 లక్షల ఎయిర్ మైళ్లు  ప్రయాణించారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఆ పర్యటనలకే పెట్టుబడిగా పెట్టాడు. తన పర్యటనల అనుభవాలను విద్యార్థులకు చెప్పాలని అనుకుంటున్నాడు.అందుకే స్కూళ్లలో ప్రసంగాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఓ పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాడు. అన్ని దేశాల్లో తిరిగిన తన అనుభవంతో  ప్రపంచవ్యాప్త సంస్కృతుల గురించి విస్తృత ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.