Ramdev Statement on Muslims: 


ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు..


యోగా గురు రామ్‌ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు, రేపిస్ట్‌లు అంటూ నోరు జారారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన బర్మేర్ జిల్లాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ముస్లింలు, క్రిస్టయన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు 
రాం దేవ్ బాబా. 


"ముస్లింలు తప్పనిసరిగా ఉదయం ప్రార్థనలు చేస్తారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంతే. ఆ తరవాత ఏమైనా చేసుకోవచ్చు. హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకుని ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలా మంది ముస్లింలు ఇదే చేస్తారు. కానీ నమాజ్‌ను మాత్రం కొనసాగిస్తారు. టెర్రరిస్ట్‌లు, క్రిమినల్స్‌లా కనిపించే వీళ్లు నమాజ్‌తో వాటిని కవర్ చేస్తారు. ఇస్లాం అంటే నమాజ్ చేయడం అని మాత్రమే వాళ్లకు తెలుసు. కానీ హిందూ మతం అలా కాదు" 
- బాబా రాం దేవ్, యోగా గురు 


ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాందేవ్ బాబా వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఓ వర్గానికి చెందిన వాళ్లు గురించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలోనూ అలాంటి వాళ్లుంటారని మాత్రమే చెప్పానని స్పష్టతనిచ్చారు. ఈ కామెంట్స్ తప్పా ఒప్పా అన్నది ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలని తెలిపారు. 


అంతకు ముందు మహిళలపై చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు. "మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు.


మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తున్నాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.             "


- బాబా రాందేవ్‌, యోగా గురువు

 

Also Read: Twitter CEO: ట్విటర్‌ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్


 



" target="_blank">
Twitter CEO: ట్విటర్‌ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్