Viral News : అసలే తాగుబోతు భర్త.. ఆ రోజు భార్యపై ఎందుకు కోపం వచ్చిందో కానీ.. ఇష్టం వచ్చినట్లుగా కొట్టి ఆమెను తాడుతో బండికి కట్టేసి ఊరంతా లాక్కెల్లాడు. పరుగెత్తలేక ఆమె ఓ చోట కింద పడితే అంతా లాక్కెళ్లాడు. ఇలా అరగంట సేపు లాక్కెళ్లిన తర్వాత కొంత మంది గ్రామస్తులు వచ్చి ఆపారు. దాంతో ఆమె ప్రాణాలు పోకుండా కాపాడుకుంది. 


సినిమాల్లో కూడా ఇలాంటి క్రూర సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆ తాగుబోతు భర్త తన భార్యకు నిజంగానే ఇలాంటి హింసాత్మక సినిమా చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ భర్త పేరు ప్రేమరామ్ మేగవాల్ గా గుర్తించారు. భార్య పేరు సుమిత్ర. వీరిద్దరూ నగౌర్ జిల్లలోని నర్సాంగాపూర్ లో నివహిస్తూ ఉంటారు. ఆరు నెలల కిందటే వీరికి పెళ్లి అయినట్లుగా చెబుతున్నారు. 


తాగుడుకు అలవాటు పడిన ప్రేమ రామ్ మేఘ్వాల్.. పెళ్లయినప్పటి నుండి భార్యను చిత్ర హింసలు పెడుతున్నారు. అలా ఓ సారి తాగి వచ్చినప్పుడు తన భార్యపై విరుచుకుపడ్డాడు.  ఇష్టం వచ్చినట్లుగా కొట్టి.. బైకుకు కట్టి లాక్కుని పోయారు.          


మేఘవాల్ అఘాయిత్యంపై గ్రామస్తులు ఆలస్యంగా స్పందించారు. సుమిత్ర బంధువులు హుటాహుటిన వచ్చి.. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తున్నాయి.     





 
దాదాపుగా నెల రోజుల కిందట ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్  మీడియాలో వైరల్ అయిన తర్వాతనే బయటకు తెలిసింది. అయితే ఇంత జరిగినప్పటికీ.. ప్రేమ రామ్ మేఘవాల్‌పై కేసు పెట్టేందుకు ఆయన భార్య కానీ..ఆయన భార్య తరపున బంధువులు కానీ సిద్ధంగా లేరు. ఈ ఘటనపై ఎవరితోనూ మాట్లాడటం లేదు. కేసులు పెడితే తమ బిడ్డ జీవితం నాశనమైపోతుందని వారు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.                                                                                     


రాజస్థాన్  లో ఇలా భార్యలపై అఘాయిత్యాలకు పాల్పడే భర్తల ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అియతే.. ఎక్కువ మంది గృహహింసకు సిద్ధపడుతున్నారు కానీ.. వారిపై కేసులు పెట్టేందుకు సిద్దపడటం లేదు.