Rajasthan Election 2023:
రిటైర్ అయ్యేదే లేదు..
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరి వదిలే వరకూ రాజకీయాలు వదిలేదే లేదని తేల్చి చెప్పారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. తన జీవితం కాంగ్రెస్‌కే అంకితం అని వెల్లడించారు. ఎప్పటి లాగే కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటారని స్పష్టతనిచ్చారు. ఇటీవలే ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో చాలా సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పద్దు తయారు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల పోటీకి రెడీ అయినట్టు ఆ బడ్జెట్ స్పష్టంగా చెప్పింది. ఇలాంటి సమయంలో గహ్లోట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. సీఎం కుర్చీ కోసం సచిన్ పైలట్ చాన్నాళ్లుగా పోటీ పడుతున్నారు. గహ్లోట్ వర్సెస్ పైలట్ ఫైట్ ఎన్నో రోజులుగా కొనసాగుతోంది. అధిష్ఠానం అప్పటికప్పుడు సర్ది చెబుతూ ఆ వివాదం ముదరకుండా చూస్తోంది. అయితే...ఇప్పుడు గహ్లోట్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేదే లేదని తేల్చి చెప్పడం వల్ల మరోసారి పైలట్‌తో వివాదం ముదురుతుందా అన్న సంకేతాలిస్తున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో అధిష్ఠానం గురించి కూడా మాట్లాడారు గహ్లోట్.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తానే వచ్చే ఎన్నికలను సమర్థంగా ముందుకు నడిపిస్తానని స్పష్టం చేశారు.
"నా చివరి శ్వాస వరకూ రాజకీయాలను వీడే ప్రసక్తే లేదు. నాకు 20-22 ఏళ్లున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. NSIUలో పని చేశాను. దాదాపు 50 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నాను. ఇన్నేళ్లలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. నన్ను మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారంటే అధిష్ఠానం ఎంత ఆలోచించి ఉండాలి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా అందరూ నాకు అవకాశామిచ్చారు. నా కాళ్లు చేతులు పని చేసేంత వరకూ కాంగ్రెస్‌కే విధేయుడిగా ఉంటాను. ఆ పార్టీ నాకు చాలా ఇచ్చింది"
అశోక్ గహ్లోట్, రాజస్థాన్ సీఎంరాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ అభాసుపాలయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన ఓ పొరపాటు చేశారు. ఫలితంగా బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేశారు. గతేడాది బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. Indira Gandhi Urban Employment Guarantee పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే పథకం గురించి మరోసారి ప్రస్తావించారు గహ్లోట్. కాసేపటి తరవాత కానీ అవి పాత బడ్జెట్ ప్రతులు అని అర్థం కాలేదు. వెంటనే గహ్లోట్ తన ప్రసంగాన్ని ఆపేశారు. అప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆందోళనకు దిగింది. తప్పుని గుర్తించిన అశోక్ గహ్లోట్ వెంటనే సభకు క్షమాపణలు చెప్పారు. అయినా...బీజేపీ శాంతించలేదు. శాంతించండి అంటూ స్పీకర్ ఎంతగా చెప్పినా సభలో గందరగోళం చాలా సేపటి వరకూ కొనసాగింది. ఆగ్రహించిన స్పీకర్..సభను వాయిదా వేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో సభ వాయిదా పడటం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
Also Read: Delhi Meerut Rapid Rail: మరో కొత్త ట్రైన్ వచ్చేస్తోంది,ఈ సారి ర్యాపిడ్ రైల్ - మొదట ఆ రూట్‌లోనే