పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణను తిరస్కరించిన కోర్టు రాజ్ కుంద్రాకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అశ్లీల చిత్రాల నిర్మాణం, వాటిని యాప్ ల లో అప్లోడ్ చేయడం చేసిన పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు కస్టడీ మంగళవారం ముగియనున్న కారణంగా దర్యాప్తు ముగిసిందని, అతనికి బెయిల్ మంజూరు చేయాలని రాజ్ కుంద్రా న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.


రాజ్‌ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని తెలుస్తోంది. అందుకే తన ఫోన్ ను మార్చాడని అధికారులు అనుమానిస్తున్నారు. రాజ్‌ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించేందుకు క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు సమాచారం.


యాక్టింగ్ పై ఆసక్తితో వచ్చే వారిని బెదిరించి.. పోర్న్ చిత్రాలను తీసి.. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో విడుదల చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను జులై 19న పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ చిత్రాలను తీస్తూ.. వాటిని హాట్‌ షాట్స్‌ యాప్‌ ద్వారా రిలీజ్‌ చేసేవాడని రాజ్‌ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టిని కూడా పోలీసులు ప్రశ్నించారు. 


పోర్న్ చిత్రాల కేసులో మోడల్‌, నటి షెర్లిన్ చోప్రాకు కూడా నోటీసులు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు.


ఈ కేసుపై సోషల్‌ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ.. పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై  ఎటాక్‌ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని తెలిపారు. ఇప్పటికే డైరెక్టర్‌ తన్వీర్‌ హష్మిని విచారించారు. నిజంగానే 20 నుంచి 25 నిమిషాల లెంత్‌ ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ తీసినట్టు ఒప్పకున్నట్టు తెలుస్తోంది.


రాజ్‌కుంద్రా కేసు నేపథ్యంలో ఆయనతో పని చేసిన చాలా మంది బయటకి వచ్చి వివరణ ఇస్తున్నారు. నటి ఫ్లోరా సైనీ కూడా కేసుపై స్పందించారు. తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తాను మాట్లాడకుంటే తప్పుచేసినట్టు అవుతుందని... అంతా అలానే ఫీల్ అవుతారని అన్నారు. ఎవరో ఇద్దరు చాటింగ్ చేసుకొని తన పేరు ప్రస్తావిస్తే ఈ కేసులో తనను ఇన్వాల్వ్‌ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో నటించానేమో కానీ... గుర్తింపు వచ్చిన తర్వాత అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చారు.