Raining Memes After L&T Chairman SN Subrahmanyan 90 Hour Work Week Idea Takes Internet By Storm: నెటిజన్లకు ఏదైనా వింతగా అనిపిస్తే దాన్ని చీల్చి చెండాడే వరకూ వదలి పెట్టారు. తాజాగా వారికి ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ చిక్కారు. ఆయన వారానికి 90 గంటలు పని చేసి యువత.. దేశాన్ని అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు. భార్య ముఖం ఎంత సేపు చూస్తారని కూడా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు చాలా చర్చకు కారణం అవుతున్నాయి. అత్యధిక మంది అలా మనుషులు ఎలా పని చేస్తారన్న స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియా కూడా దాడిచేస్తోంది. ఆయనపై మీమ్స్‌తో హడావుడి చేస్తోంది.
90 గంటల పాటు వర్క్ చేయాలన్న కామెంట్ల కన్నా.. భార్యల ముఖం ఎంత సేపు చూస్తారని ఆయన చేసిన కామెంట్లే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. కుటుంబం సంగతేమిటని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
సుబ్రహ్మణ్యన్ తన భార్య ముఖాన్ని చూడటం మానేసిఉంటారని కొొంత మంది జోస్యం చెబుతున్నారు.
అయితే కొంత మంది సీరియస్‌గా ఇది చాలా తప్పు అని చెబుతున్నారు. అలా పని చేయడం సక్సెస్ కు దారి కాదని అంటున్నారు.
ఇలా బానిసల తరహాలో పని చేయాలని కోరుతున్నారంటే..ఇండియాలో కఠినంగా లేవని అర్థమని మరికొంత మంది అంటున్నారు.