Railways to allow ticket status check 10 hours before train departure: భారతీయ రైల్వేలు ప్రయాణికులకు గొప్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని సవరిస్తూ, టికెట్ స్టేటస్ ..కన్ఫర్మ్, వెయిటింగ్ లిస్ట్, RAC ను గరిష్టంగా 10 గంటల ముందు తెలుసుకునే అవకాశం కల్పించనున్నాయి. రైల్వే బోర్డు ఇటీవల ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఇప్పటివరకు రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు మాత్రమే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారవుతుంది. దీని వల్ల చివరి నిమిషం వరకు ప్రయాణికులు టికెట్ స్టేటస్ గురించి ఆందోళన చెందాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైల్వేలకు ముందు రోజు రాత్రి 8 గంటలకు మొదటి చార్ట్ తయారవుతుంది. మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరే రైల్వేలకు రైలు బయలుదేరే 10 గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది.
ఈ సవరణ రైల్వే బోర్డు చేపట్టిన మొదటి పెద్ద మార్పు. అన్ని జోనల్ డివిజన్లకు ఈ మేరకు సూచనలు పంపించారు. ప్రయాణికులు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇబ్బంది పడుతున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు రైలు బయలుదేరే సమయం వరకు ఆందోళన చెందాల్సి వస్తోంది. ఈ కారణంగా రైల్వే బోర్డు ఈ సవరణ చేపట్టింది. దీంతో ప్రయాణికులు ముందుగానే తమ స్టేటస్ తెలుసుకుని, హోటల్ బుకింగ్, కనెక్టింగ్ ట్రావెల్ లేదా ఆల్టర్నేటివ్ ప్లాన్‌లు చేసుకోవచ్చు.
ప్రయాణికుల సౌకర్యం కోసం చార్ట్‌ను ముందుగానే తయారు చేస్తున్నామని. ఇది సులభంగా ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది గంటల ముందు తెలుస్తుంది. కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇక చివరి నిమిషంలో ఇబ్బంది పడరు. మిలియన్ల మంది రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం, పారదర్శకత లభిస్తుంది. ఈ మార్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.