ట్రైన్ జనరల్ టికెట్స్ ఫోన్ లో నుండే బుక్ చేసుకునేలా రూపొందిన 'UTS ' యాప్ ఈరోజు   (28 ఫిబ్రవరి 2026) తో క్లోజ్ అయిపోతోంది. రైల్వే ఈ యాప్ ను అధికారికంగా షట్ డౌన్ చేసేస్తోంది.  రేపటి నుండి జెనరల్ టికెట్ అయినా వేరే ఏ క్లాస్ టికెట్ అయినా 'railone ' యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు  అని అధికారులు తెలిపారు. 

Continues below advertisement

జనరల్ టికెట్స్ తీసుకోవడం కోసం ఇన్నాళ్లు ఉపయోగపడిన UTS యాప్ 

జనరల్ టికెట్స్ తీసుకోవడం కోసం  27 డిసెంబర్ 2014 లోనే UTS యాప్ ను లాంచ్ చేసింది రైల్వే. ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్స్, సీజన్ టికెట్స్,ప్లాట్ ఫామ్ టికెట్స్ ను ఇంటిదగ్గర నుండే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే రైల్వే ట్రాక్ కు కనీసం 4మీటర్ల దూరం లో మాత్రం  ఉండి బుక్ చేసుకోవాలి. ఈ యాప్ వల్ల టికెట్ కౌంటర్ వద్ద లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండేది కాదు. కోవిడ్ తరువాత ఈ యాప్ ను వాడే వారిసంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు రైల్వే అన్ని రకాల రైల్వే సేవలను ఓకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి తేవాలని నిర్ణయం తీసుకోవడం తో 'Rail one ' యాప్ ను ప్రమోట్ చేస్తోంది. అందులో భాగం గా ఈరోజు తో (28.02. 2026) రైల్వే యాప్ క్లోజ్ అయిపోతోంది. ఇకపై (01.03.2026) నుండి అన్ని రకాల టికెట్స్ కూడా  ' rail one ' యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

Continues below advertisement

UTS వాలెట్ లో డబ్బులు ఉండిపోయాయా? టెన్షన్ పడకండి 

ఈరోజు తో క్లోజ్ అయిపోయే UTS యాప్ లో మీ డబ్బులు ఉండిపోతే అవి పోతాయేమో అని టెన్షన్ పడకండి. ఆ డబ్బులు మీరు Rail one యాప్ డౌన్ లోడ్ చెయ్యగానే ఆ యాప్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అయితే ఏ ఫోన్ నెంబర్ తో UTS యాప్ వాడుతున్నారో అదే  నెంబర్ తో rail one యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకుని ఉండాలి. అలాగే Railone యాప్ ను ప్రమోట్ చేయడం కోసం ఆరు నెలల పాటు అంటే 14.01.2026 నుండి 14.7.2026 వరకూ జెనరల్ టికెట్ బుకింగ్ ఫై 3% డిస్కౌంట్ కూడా ఆల్రెడీ అమలులో ఉందని కాబట్టి ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించు కోవాలని అధికారులు తెలిపారు.