Railway reservation period limiting to two months : దూర ప్రయాణాలకు టిక్కెట్లు దొరుకుతాయో లేదో అని మందస్తుగా ప్లానింగ్ చేసుకుని టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ నాలుగు నెలల వరకూ ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని రెండు నెలలకే పరిమితం చేస్తున్నారు. అంటే ఇక నుంచి అరవై రోజుల ముందుగా మాత్రమే రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.



Also Read: కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లకు మాత్రమేనా ? ఇతర భారతీయులు వెనక్కి రావాల్సిందేనా ?





అయితే ఆరు నెలల ముందుగా బుక్ చేసినా ఇదే రష్ ఉంటుంది. రెండు నెలల ముందుగా టిక్కెట్లు రిలీజ్ చేసిన ఇదే రష్ ఉంటుంది. పెద్దగా తేడా ఉండదు. మరి రైల్వేశాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఈ నిర్ణయంపై రైల్వే ప్రయాణికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా.. ఏజెంట్లను నియంత్రించడానికి ఇది  బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కొంత మంది మాత్రం.. ఇలా చేయడం వల్ల ముందస్తుగా టూర్లు ప్లాన్ చేసుకోవాలనుకునేవారి ఇబ్బందేనని అంటున్నారు.                             


భారత్‌ చేసిన తప్పులు కారణంగానే ఉద్రిక్తతలు- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు


ఈ నిర్ణయం  నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే అప్పటి వరకూ బుక్ చేసుకున్న టిక్కెట్లు చెల్లుతాయి. అలాగే నవంబర్ ఒకటే తేదీ వరకూ 120 రోజుల బుకింగ్ పిరియడ్ అందుబాటులో ఉంటుంది. అంటే అప్పటి వరకూ 120 రోజుల వరకూ ప్రయాణాలుంటే ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు.